గాల్లో నుంచి ఊడిపడ్డ పెళ్లికొడుకు

సాధారణంగా హిందువుల పెళ్లిలో పెళ్లికొడుకు ముందుగా వచ్చి పెళ్లిపీటలపై కూర్చుంటాడు.అదే క్రైస్తవ పెళ్లిలో వరుడు, వధువు కలిసి వస్తారు.

కానీ వీరంతా నేలపైనే ఉంటారు.మెక్సికోలోని ఓ వివాహ వేడుకలో మాత్రం పెళ్లికొడుకు గాల్లో నుంచి ఊడిపడ్డాడు.

ఇదేమీ మాటవరసకు అనే పదం కాదండీ.నిజంగానే ఆ వరుడు గాల్లో నుంచి భూమిపై పడ్డాడు.

మెక్సికోలోని లాస్ కాబోస్‌లో హార్డ్‌రాక్ అనే హోటల్‌లో ఆకాష్ యాదవ్ అనే నటుడు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు.అయితే అతడు పెళ్లిపందిరి వద్దకు చేరుకున్న విధానమే ఇప్పుడు అతడి ప్రత్యేకతను చాటుకుంది.

Advertisement

అతడు తన పెళ్లిక స్కైడైవింగ్ చేస్తూ వరుడి తరఫువారు బారాత్‌గా వెళుతున్న చోట నింగిలో నుంచి నేలపైకి దిగాడు.అతడు గాల్లో నుంచి దిగుతున్న వీడియోను అక్కడే ఉన్నవారు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.ఈ వరుడు తన పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చూడకపోతే ఇలాంటి సాహసం చేస్తాడని నెటిజన్లు అతడిని మెచ్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు