స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సీరియల్ అని చెప్పవచ్చు.ఇక ఇందులో నటించే నటీనటులు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇక వారు తమ పాత్రలతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.అందులో ఎక్కువగా ఆకట్టుకున్న పాత్ర తులసి.
ఈ తులసి పాత్ర అనేది ప్రేక్షకులను మరింత ఎక్కువగా దగ్గర చేసుకుంది.
ఇక తులసి పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు కస్తూరీ శంకర్.
ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో వెండితెరపై హీరోయిన్ గానూ, సహాయ పాత్రల్లోనూ గాను నటించింది.అంతేకాకుండా బుల్లితెరపై కూడా నటించింది.
ఇక ఈమె అప్పట్లో మిస్ మద్రాస్ గా టైటిల్ కూడా సొంతం చేసుకుంది.పలు షో లలో కూడా వ్యాఖ్యాతగా చేసింది.
తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగా సందడి చేసింది.ఇక ఈమె ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
అప్పుడప్పుడు ఆమె చేసే కౌంటర్ లు బాగా పెలుతూ ఉంటాయి.రాజకీయ విషయాలలో కూడా బాగా పట్టుతో ఉంటుంది.ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పలువురి రాజకీయ నాయకులను తన స్టైల్ లో విమర్శిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా పలువురు రాజకీయ నాయకులను చాలాసార్లు విమర్శించింది.ఈమె చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి.అలా ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
ఈమె షేర్ చేసుకునే ఫోటోలను చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేం.
లేటు వయసులో కూడా తన అందాలను తెగ ఆరబోస్తుంది.
అంతేకాకుండా ఈ తరం హీరోయిన్లు చేసే గ్లామర్ షో చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.నిజానికి ఈమె చేసే గ్లామర్ షోకు కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె తన ఇన్ స్టా వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో చీర కట్టుకొని పద్ధతిగా కనిపించింది.అయితే తనను తాను మిస్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇక ఆమె ఫోటో చూసిన నెటిజన్స్ మాత్రం రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.నువ్వు మిస్ అవుతుంది నిన్ను కాదు నీ హాట్ నెస్ ను అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఆమె ప్రాజెక్టులలో కూడా బాగా బిజీగా ఉంది.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వరస ప్రాజెక్టులతో అవకాశాలు అందుకుంటుంది.
అప్పుడప్పుడు తెలుగు బుల్లితెరపై పలు షో లలో పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.







