ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

దాదాపు 700 మంది రోగులకు వైద్య పరీక్షలు.బోయినిపల్లి :గ్రామీణ పల్లె ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించాలని సంకల్పంతో పదండి పోదాం పల్లె కి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని ఇందులో బాగంగా కొదురుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు లైఫ్ లైన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రదీప్ కుమార్ (Dr.

Pradeep Kumar)పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో బి.సి.ఎం చారిటబుల్ కంటి దవఖానలో శనివారం రోజున ఏర్పాటు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు శ్రీ సాయి లైఫ్ లైన్ హాస్పిటల్ (Sri Sai Life Line Hospital)కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా.ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ జనరల్ సంస్థ,శస్త్ర చికిత్స నిపుణులు, గైనకాలజీ, చిన్న పిల్లల వైద్య నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్,గుండె వైద్య నిపుణులు,రేడియాలజీ, ఎముకల వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు వివద పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వి.రాజలింగం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, అధ్యక్షులు డాక్టర్ బి.ఎన్ రావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association)రాష్ట్ర అధ్యక్షులు హాజరైఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.అనంతరం డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు తాను పుట్టి పెరిగిన ఊరు కొదురు గ్రామం కాబట్టి ఈ గ్రామం లోని మొదటగా స్టార్ట్ చేశామని ఇకనుండి కోధురుపాక గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి నెల మొదటి ఆదివారం రోజున అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు బీసీఏం ట్రస్ట్ (BCM Trust) కంటి దావకాన లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చిన డాక్టర్ రాజలింగంకు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్య అతిధి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రాజలింగం మాట్లాడుతూ ఇలాంటి కార్య క్రమాలు చేయడం అభినందనీయమని ఇట్టి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ క్యాంపులో ఉచిత కన్సల్టేషన్, ఉచిత రక్త,మూత్ర పరీక్షలు జరిపి,ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోగినపల్లి శ్యామలాదేవి , ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకళ సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపెళ్లి సుధాకర్, వైస్ ఎంపీపీ కోనుకటి నాగయ్య ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి , సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు,లతోపాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

Latest Suryapet News