ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఫైరింజన్‌ మంజూరు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలోని ఫైర్‌ స్టేషన్‌కు ఫైరింజన్‌ నీ మంజూరు చేయడం తో పాటు సిబ్బందిని నియమించారు.రవాణా శాఖ మంత్రిమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక చొరవతో ఫైర్ఇంజన్ తో పాటు సిబ్బందిని కేటాయించడం పట్ల ఖమ్మం ఏఎంసీ చైర్‌పర్సన్‌ దోరెపల్లి శ్వేత, ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం, సిబ్బందితో పాటు జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు తదితరులు మంత్రి పువ్వాడ కు కృతజ్ఞతలు తెలిపారు.

 Grant Of Firenjan To Khammam Agricultural Market, Khammam, Firenjan , Khammam A-TeluguStop.com

ఈ సందర్భంగా ఖమ్మం ఏఎంసీ చైర్‌పర్సన్‌ శ్వేత మాట్లాడుతూ మార్కెట్‌కు పత్తి, మిర్చి,తదితర పంటలు తీసుకువచ్చే రైతులకు అగ్నిప్రమాదాలనుండి తమ పంటలను కాపాడుకునేందుకు గాను మంత్రి అజయ్‌ ఫైరింజన్‌తో పాటు సిబ్బందిని నియమించడం గొప్ప విషయమన్నారు.ఖమ్మం మార్కెట్‌ ప్రాంగణంలో ఉన్న ఫైర్‌ స్టేషన్‌కు చాలా ఏండ్లుగా ఫైరింజన్‌తో పాటు సిబ్బంది లేక మార్కెట్‌కు పంటలు తీసుకొచ్చే రైతులు, అధికారులు, ప్రజలు ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉండేవారని, రైతుల కష్టాలు తెలిసిన మంత్రి అజయ్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మార్కెట్‌లో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండేలా ఫైరింజన్‌ను తక్షణమే మంజూరు చేయడం అబినందనీయమని వారు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube