ఉమ్మడి కుటుంబాలు పోయాక మానవ సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి.చాలా మంది డబ్బు సంపాదనకే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు.
సమాజంలో తమకు డబ్బు తప్పా ఇంకేమీ అవసరం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు.కనీసం కుటుంబ సభ్యులను కూడా పట్టించుకునే తీరిక లేకుండా ప్రవర్తిస్తుంటారు.
ఇంత వరకు బాగానే ఉన్నా డబ్బు సంపాదన లేని వారు మాత్రం దారుణాలకు పాల్పడుతున్నారు.డబ్బు వస్తుందంటే ఎలాంటి నేరాలు చేసేందుకైనా వెనుకాడడం లేదు.
ఇదే తరహాలో ఓ వ్యక్తి దారుణ ప్రవర్తన బయట పడింది.తన సొంత బామ్మను ఆ వ్యక్తి అమానుషంగా కొట్టాడు.
దీనికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.
వృద్ధాప్యం వచ్చాక ఎవరికైనా శరీరంలో శక్తి సన్నగిల్లుతుంది.
తమ రోజువారీ పనులు చేయడానికే ఇబ్బంది పడుతుంటారు.దీంతో ఇతరులపై వారు ఆధారపడతారు.
ఇక పనులుకు వెళ్లడం అంటే అది సాధ్యం కాని పని.దీంతో పండుటాకుల కోసం ప్రభుత్వం సామాజిక పింఛను అందజేస్తోంది.నెలవారీ కొంత మొత్తాన్ని వారికి అందిస్తోంది.అయితే దానిపై కన్నేసిన ఓ మనవడు తన బామ్మను పీడించాడు.డబ్బు ఇవ్వలేదని దారుణంగా దాడి చేశాడు.ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఇటీవల జరిగింది.
గోవర్దన్ అనే వ్యక్తి తన బామ్మ యశోదమ్మను పింఛను డబ్బుల కోసం కొట్టాడు.కింద పడేసి తన్నాడు.
తనకు పింఛను డబ్బులు ఇచ్చేయాలని కోరితే ఇవ్వలేదని ముసలావిడ అని కూడా చూడకుండా వికృతంగా ప్రవర్తించాడు.ఈ దారుణాన్ని సీహెచ్ సుశీల్ రావు అనే వ్యక్తి ట్విట్టర్‌లో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది.
వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







