విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై వైసీపీ ప్రభుత్వం చెబుతున్నవి కాకి లెక్కలు అని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు.లాలూచీ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు.
అవగాహన పత్రాలతో అన్నీ జరిగినట్లు కాదన్న తులసిరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అయితేనే ప్రయోజనం అని వెల్లడించారు.గత నాలుగేళ్లుగా జగన్ ను నమ్మని వాళ్లు ఇప్పుడెలా నమ్మారని ప్రశ్నించారు.రూ.13 లక్షల కోట్ల పెట్టుబడి కాదు… విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని సూచించారు.ఏపీకి ప్రత్యేక హోదా సాధించి ఉంటే ఇలాంటి సదస్సులే అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు.సమ్మిట్ లో రాజధాని గురించి మాట్లాడటం సమంజసమా అని ప్రశ్నించారు.