ఆంధ్ర ప్రదేశ్ లో సలహాల రావుల సంఖ్య తగ్గనుందా?

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ఇతర విషయాల్లోఏ స్థానం లో ఉందో తెలియదు గాని సలహాదారుల నియామకం విషయం లో మాత్రం మొదటి స్థానంలో ఉంది.ఏ ప్రబుత్వం నియమించని స్తాయిలో సలహాదారులను నియమించిన గనత మాత్రం జగన్( cm jagan ) ప్రబుత్త్వానిదే .

 Govt Can Reduce The Number Of Advisors In Ap ,advisors,ap ,andhra Pradesh,cm Ja-TeluguStop.com

వీరిచ్చే సలహాలు ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ వీరి మూలంగా ఖజానా మాత్రం ఖాళీ అవుతుంది .ప్రభుత్వ ఉద్యోగులకు ( government employees )సమయానికి జీతాలు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదని చెప్పుకోస్తున్న ప్రభుత్వం మరి సలహాదారుల సంఖ్యను మాత్రం తగ్గించడం లేదు సరికదా అంతకంతకు పెంచుతూ పోతుంది ఇప్పటికే సలహాదారుల సంఖ్య 60 మంది దాకా ఉంది తొందరలోనే సెంచరీ కూడా చేయొచ్చు ఏమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Telugu Advisors, Andhra Pradesh, Cm Jagan, Employees, Mutyalaraju-Telugu Politic

విషయానికొస్తే జ్వాలరపు శ్రీకాంత్ ను దేవాదయ శాఖ సలహాదారుడుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 638 ను సవాలు చేస్తూ బ్రాహ్మణసేవ సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్ కె రాజశేఖర్ రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు దీనిని విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది .అసలు సలహాదారులు నియామకంలో ఏలాంటి నీయమ నిబంధనలు పాటిస్తున్నారు తెలపాలని కోరింది .అసలు ఈ స్థాయిలో సలహాదారుల అవసరం ప్రభుత్వానికి ఏముంటుందని వీరి నియామకం సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తునట్టుగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేసింది దీనికి బదులిచ్చిన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఇకపై సలహాదారులు నియామకాలపై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ,ముఖ్యమంత్రి కి ఉన్న సలహాదారులందరిని మంత్రులకు కేటాయిస్తామని ,ఆయా సబ్జెక్టుల్లో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సంబంధిత మంత్రిత్వ శాఖ కు వారిని కేటాయిస్తామని కోర్టుకు తెలిపారు.

Telugu Advisors, Andhra Pradesh, Cm Jagan, Employees, Mutyalaraju-Telugu Politic

సలహాదారులకు రెండేళ్ల పదవీకాలం ఉంటుందని ఆ తరువాత మరో రెండేళ్ల పాటు వారిని కొనసాగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని .ప్రభుత్వ సమాచారం లీక్ అవ్వకుండా వారి చేత అఫిడవిట్ పై సంతకం తీసుకుంటామని ఆయన కోర్టుకు తెలిపారుఏది ఏమైనా ఇంతవరకు నిర్దిష్టమైన పని, బాధ్యత లేకుండా సలహాదారులు నియమిస్తున్నారు అన్న ఆరోపణల మధ్య ఇప్పటికైనా ఒక ప్రత్యేక విధానంలో సలహాదారులు నియమించడం మంచిదే అన్న వార్తలు వినిపిస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube