ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తొలిపూజ‌

వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని.హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి కొలువు దీరాడు.

ఈ క్ర‌మంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ గ‌ణ‌ప‌య్య‌కు తొలిపూజ నిర్వ‌హించారు.ప్ర‌జా సంక్షేమాన్ని కోరుకుంటూ ప్రార్థ‌న‌లు చేప‌ట్టారు.

గ‌వ‌ర్న‌ర్ కు ఘ‌న స్వాగ‌తం పలికిన పురోహితులు.స్వామివారి ద‌ర్శ‌నానంత‌రం ఆమెకు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

కాగా, ఖైర‌తాబాద్ లో తొలిసారిగా మ‌ట్టితో చేసిన బొజ్జ గ‌ణ‌ప‌య్య విగ్ర‌హం ఏర్పాటు చేశారు.పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న 50 అడుగుల‌తో నిర్మించారు.

Advertisement

కుడివైపున శ్రీ షణ్ముక సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవిల‌తో లంబోద‌రుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు