ఫేస్ రికగ్నిషన్ యాప్ పై టీచర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం

విద్యావ్యవస్థలో మార్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు విషయాలు వెల్లడించారు.

 Government Discussions With Teachers On Face Recognition App Have Been Successfu-TeluguStop.com

మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో​ మాట్లాడుతూ.ఉపాధ్యాయ సంఘాలతో రెండు అంశాలపై చర్చించాము.

విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఫేస్‌ రికగ్నెజేషన్‌ యాప్‌లో లోపాలు సరిదిద్దాము.

ఈ యాప్‌ అమలు కోసం 15రోజుల గడువు కోరాము.యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పాము.

ఫేస్‌ రికగ్నెజేషన్‌ యాప్‌ అమలుకు టీచర్లు అంగీకారం తెలిపారు.విద్యావ్యవస్థలో మార్పులు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము.నాడు-నేడు ద్వారా స్కూళ్లలో మార్పులు తెచ్చాము.మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తున్నాము.248 పోస్టులను సీనియారిటీపరంగా భర్తీ చేశాము.38 డిప్యూటీ డీఈవో పోస్టులను కొత్తగా ఇస్తున్నాము.మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్‌’ అని స్పష్టం చేశారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube