మండల అభివృద్ధి కి కృషి చేస్తా:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:మోటకొండూరు మండల అభివృద్ధి కి కృషి చేస్తానని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.సోమవారం మోటకొండూరు మండల కేంద్రం నుండి చాడ గ్రామానికి 2 కిలోమీటర్లు డీ.ఎం.ఎఫ్.టి నిధులతో మంజూరైన బిటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటకొండూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానన్నారు.

 Government Whip Birla Ailaiah Will Work For The Development Of Mandal , Governme-TeluguStop.com

మండల కేంద్రానికి రావడానికి పరిసర ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఈ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మండలంలో సమస్యలన్ని దశలవారీగా పరిష్కరించుకుందామని చెప్పారు.

ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ప్రజలు సమస్యలపై ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్యరెడ్డి,వైస్ చైర్మన్ పచ్చిమట్ల మధార్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ భాస్కరుని రఘునాథరాజు,మార్కెట్ కమిటీ డైరక్టర్ తండా పాండురంగయ్య గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్,నెమ్మని సుబ్రహ్మణ్యం,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు క్యాసగల్ల చందు,మల్లేశ్,బుగ్గ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube