గ్రామపంచాయతీ కార్యదర్శులపై ప్రజావాణిలో ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న విజయ, ప్రియాంకలపై గుండాల మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ అన్నేపర్తి భిక్షం సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాపురం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విజయ మరిపడిగతో పాటు మండల కేంద్రానికి ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు.ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా మరిపడిగా గ్రామ పరిధిలోని రూ.68,150 పంచాయతీ వర్కర్లకి బదిలీ చేసి అనంతరం తిరిగి తీసుకున్నరని,అలాగే గంగాపురం గ్రామానికి సంబంధించిన రూ.77,000 మండల ఆఫీసులోని ఉద్యోగి శ్రీకాంత్ కు బదిలీ చేశారని,గుండాల గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామపంచాయతీ సిబ్బంది అయినా సూదగాని రామచంద్రకు రూ.83,000,అల్లంశెట్టి మహేష్ కు రూ.30976 బదిలీ చేశారు.మొత్తం మూడు గ్రామ పంచాయతీల రూ.2,09,150 అవినీతికి పాల్పడినట్లు తెలిపారు.మరొక కార్యదర్శి ప్రియాంక నూనెగూడెం గ్రామపంచాయతీతో పాటు బండకొత్తపల్లికి ఇంన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.రెండు గ్రామాల పేరు మీద రూ.1,07,476 అవినీతికి పాల్పడి తన సొంత ఖాతాలోకి రూ.26,715 బదిలీ చేసుకొని మిగతా డబ్బులను గ్రామపంచాయతీ సిబ్బంది అకౌంట్లోకి జమ చేసి తిరిగి తీసుకువెళ్లారని ఆరోపించారు.ఇద్దరు కార్యదర్శులు చేసిన అవినీతిపై పూర్తి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జండగే కు ఫిర్యాదు చేశానని తెలిపారు.ఎంపీడీవో దేవికను వివరణ కోరగా జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి మేమో జారీ అయిందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.

 Complaint Against Gram Panchayat Secretaries In Prajavani, Prajavani, Complaint-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube