తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై తమ ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.
ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికే శ్వేతపత్రం విడుదల చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టలేదు, చర్చించలేదని చెప్పారు.
బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరిన విధంగా జ్యుడిషియల్ విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.మూడు అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.







