గాటా తెలుగు అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా సాయి. గొర్రె పాటి..!!!

గాటా ( అమెరికా గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్) 10 వ చీఫ్ కో ఆర్డినేటర్ గా గొర్రెపాటి సాయి నియమితులు అయ్యారు.

ఈ మేరకు ఏర్పాటు అయిన గాటా కార్యవర్గ సంఘం ఆయన నియామకాన్ని తెలిపింది.

అమెరికాలో ఆయా ప్రాంతాలకి తగ్గట్టుగా తెలుగు సంఘాలు ఎన్నెన్నో ఉన్నాయి.ఏ తెలుగు సంఘం అయినా సరే అమెరికాలో ఉండే తెలుగు వారికి సహాయ సహకారాలు అందివ్వడానికి అలాగే తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ కోవలోనే గాటా తెలుగు సంఘం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, తెలుగు పండుగలని ఎంతో వైభవంగా నిర్వహించడంలో ఎంతో చురుకుగా పాల్గొనేది.గాటా కార్యవర్గ సమావేశంలో 10వ చీఫ్ కో ఆర్డినేటర్ ని నియమించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గాటా వ్యవస్థాపక సభ్యులు, కొత్తగా చేరిన సభ్యులు అందరూ కలిసి సాయి.గొర్రెపాటి కి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

గత కార్యవర్గ హయాంలో జరిగిన వివిధ కార్యక్రమాలు వివరించారు.

10 వ వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే కార్యక్రమాలని వివరించారు నూతన సభ్యులు.అట్లాంటాలో ఇన్ఫినిటీ సెంటర్ లో మే 29 ,30 న జరగబోయే కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తమ సభ్యులు తరలి రావాలని తెలిపారు.గాటా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలు అందరిని అలరిస్తాయని నూతన కార్యవర్గం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు