మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈయన గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
మంచి కటౌట్ ఉండడమే కాకుండా మంచి డైలాగ్స్ కూడా చెప్పగల సత్తా ఉండడంతో హీరోగా రాణిస్తున్నాడు.అయితే ఈయన ఎంచుకునే సినిమాలే పెద్దగా కలిసి రావడం లేదు.
ఏ సినిమా చేసిన రోటీగ్ గా ఉండడంతో ప్రేక్షకుల నుండి రిజక్షన్ వస్తుంది.ఇక ఇటీవలే ఈయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.లౌక్యం, లక్ష్యం వంటి రెండు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ తో రామబాణం( Ramabanam ) చేయగా ఇది కూడా ఆకట్టుకోలేక పోయింది.ఇదిలా ఉండగా ఈయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ హర్ష( Director Harsha ) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా నుండి ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ రోజు మ్యాచో స్టార్ గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ సినిమాకు ”భీమా”( Bheema Movie ) అనే టైటిల్ ను పెట్టినట్టు కన్ఫర్మ్ చేసారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తూనే అర్ధం అవుతుంది.

మరి గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో రెండవసారి నటిస్తున్నాడు.చూడాలి ఈసారి రూటు మార్చి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది.ఇక ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు.ఇంకా ఈ సినిమా మిగిలిన డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి బయటకు రాలేదు.
త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.







