కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ.. కానీ..?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నట్టు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.గూగుల్ లో కేజీఎఫ్ 2 కాస్ట్ అని టైప్ చేస్తే బాలకృష్ణ ఫోటో కనిపిస్తోంది.

బాలయ్య ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలో నటిస్తున్నట్టు గూగుల్ చెబుతోంది.ఎక్కడో జరిగిన పొరపాటు వల్ల గూగుల్ ఈ విధంగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

కేజీఎఫ్ 2 ఛాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

2021 సంవత్సరం జనవరి 8వ తేదీన కేజీఎఫ్ టీజర్ విడుదల కానుంది.కేజీఎఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా దేశంలోని ఆరోజే రిలీజ్ డేట్ గురించి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ నిజంగానే కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తూ ఉండవచ్చని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కేజీఎఫ్ 2 చిత్రబృందం ఇనాయత్ ఖలీల్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో స్పష్టత ఇస్తే బాలకృష్ణ నిజంగా నటిస్తున్నారో లేదో తెలిసే అవకాశం ఉంది.ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు