ఒకపక్క టెక్నాలజీ( Technology ) వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే.మరోపక్క అదే టెక్నాలజీ ఉపయోగించి అమాయక ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.
గూగుల్ తన క్రోమ్ యూజర్ల( Google Chrome users ) భద్రత కోసం, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండడం కోసం ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ తో మాల్వేర్ అటాక్ సైబర్ అటాక్ల( Cyber Attacks ) బారిన పడకుండా క్రోమ్ యూజర్లకు ఈ ఫీచర్ అప్రమత్తం చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్( Safe Browsing Feature ) అనేది ప్రధానంగా ఫిషింగ్స్, మాల్వేర్ అటాక్ లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.క్రోమ్ యూజర్లు పొరపాటున సైబర్ నేరగాళ్ల వెబ్సైట్ ను సందర్శిస్తే వెంటనే ఈ ఫీచర్ అప్రమత్తం చేస్తుంది.టెస్టింగ్ దశలో భాగంగా ఈ ఫీచర్ 25% ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు గూగుల్ తెలిపింది.గూగుల్ సంస్థ తన ట్రాకింగ్ మెకానిజాన్ని( Tracking Mechanism ) రియల్ టైం ఫంక్షన్ తో అనుసంధానం చేసింది.
దీంతో రియల్ టైం ట్రాకింగ్ మెరుగ్గా పనిచేస్తుందని గూగుల్ భావిస్తోంది.క్రోమ్ యూజర్లు గూగుల్లో ఏదైనా ఒక వెబ్సైట్ సందర్శించినప్పుడు క్యాచీ ఆధారంగా వెబ్సైట్ భద్రతను ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తుంది.
ఆ వెబ్సైట్ URL ను ప్రైవసీ సర్వర్( Privacy Server ) కు పంపించి రియల్ టైం లోను భద్రతను పర్యవేక్షిస్తుంది.బ్యాక్ గ్రౌండ్ లో వెబ్సైట్ భద్రతను గూగుల్ తనిఖీ చేసి, ఏవైనా భద్రతా లోపాలు గుర్తిస్తే వెంటనే యూజర్లకు అప్రమత్తం చేస్తుంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సైబర్ నేరగాళ్ల నేరాలకు చెక్ పెట్టినట్టే.