గూగుల్ పే నుంచి ఇక జెట్ స్పీడుతో డబ్బులు పంపించుకోవచ్చు తెలుసా?

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే( Google Pay ) కస్టమర్లకు ఓ శుభవార్తను తీసుకు వచ్చింది.ఇపుడు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చిన్నపాటి లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కలిగించింది.

 Google Pay Launches Upi Lite To Boost Small Value Transactions Details, Google P-TeluguStop.com

ఈ క్రమంలోనే యూపీఐ లైట్ సేవలను పరిచయం చేసింది.యూపీఐ లైట్‌ ద్వారా సింగిల్ ట్యాప్‌తో రూ.200 వరకు పంపించుకోవచ్చన్నమాట.కిరాణా, స్నాక్స్, క్యాబ్ రైడ్‌ల వంటి రోజువారీ ఖర్చులకు క్విక్ పేమెంట్స్ చేయడానికి యూపీఐ లైట్‌ ఇపుడు వినియోగదారులకు అనువుగా ఉంటుంది.యూపీఐ లైట్ వాలెట్‌లో రోజుకు 2 సార్లు రూ.2,000 వరకు యాడ్ చేసుకుని క్విక్ పేమెంట్స్‌ చేసుకొనే వెసులుబాటు ఇపుడు కలదు.

Telugu Google Pay, Googlepay, Gpay, Number, Paytm, Phone Pe, Ups, Upi Lite-Lates

పేటీఎం, ఫోన్‌పే యాప్‌లలో ఈ ఫీచర్‌ ఆల్రెడీ అందుబాటులోకి రాగా ఇపుడు తాజాగా గూగుల్ పేలో రావడం గమనార్హం.ఇకపోతే 15 బ్యాంకులు మాత్రమే ప్రస్తుతం యూపీఐ లైట్ కి మద్దతు తెలుపుతున్నాయి.మరికొద్ది నెలల్లో మరిన్ని బ్యాంకులు యూపీఐ లైట్‌కు( UPI Lite ) సపోర్ట్ చేయవచ్చనే ఊహాగానాలు వున్నాయి.దీనిని యాక్టివేట్ చేసుకొనేందుకు మొబైల్‌లో మొదట గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేయాలి.

ఆ తరువాత ప్రొఫైల్ ఐకాన్ లేదా ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయాలి.ప్రొఫైల్ పేజీలో కిందకు స్క్రోల్ చేసి “యూపీఐ లైట్” ఆప్షన్‌పై నొక్కితే యూపీఐ లైట్ గురించి సూచనలు, వివరాలతో కొత్త స్క్రీన్ లేదా విండో కనిపిస్తుంది.

ఆ సమాచారాన్ని చదవి “ఆక్టివేట్ యూపీఐ లైట్” ఆప్షన్‌ సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది.

Telugu Google Pay, Googlepay, Gpay, Number, Paytm, Phone Pe, Ups, Upi Lite-Lates

ఆ తరువాత యూపీఐ లైట్‌కు బ్యాంక్ ఖాతాను లింక్ చేయడానికి ఆన్-స్క్రీన్ కనబడిన సూచనలు ఫాలో కావాలి.ఒక్కసారి బ్యాంక్ అకౌంట్‌ లింక్ చేసిన తర్వాత, యూపీఐ లైట్‌ వాలెట్‌కు డబ్బులు యాడ్ చేసుకోవచ్చు.రూ.200కి సమానమైన లేదా అంతకంటే తక్కువ విలువైన లావాదేవీల చెల్లింపుల సమయంలో యూపీఐ లైట్ అకౌంట్ డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయి కనిపిస్తుంది.అటువంటి లావాదేవీల కోసం యూపీఐ పిన్‌( UPI Pin ) ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గూగుల్ పే గుర్తు చేస్తుంది.

ఇండియాలో డిజిటల్ చెల్లింపులను పెరగడానికి యూపీఐ ప్రత్యేకమైన ఆఫర్ల ప్రాముఖ్యతను తీసుకువస్తోంది.యూజర్లకు అనుకూలమైన, వేగవంతమైన పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌లో ఇపుడు యూపీఐ లైట్ పరిచయం చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube