ఇకపై ఆ గూగుల్ ఉద్యోగులకు వేతనం కట్.. ఎందుకంటే..?!

కరోనా వైరస్ వలన దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది.ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.

మరి కొంతమంది మాత్రం చేసేది లేక ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేస్తున్నారు.ఒక్కరోజా రెండు రోజులా చెప్పండి.

దాదాపు రెండు సంవత్సరాల నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉద్యోగులు అలవాటు పడిపోయారు.అందులోను ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయాలంటే కరోనా వైరస్ భయం.ఈ క్రమంలో చాలామంది ఇంటికే పరిమితం అయి ఆఫీస్ వర్క్ చేస్తున్నారు.కానీ ఇప్పుడు కరోనాకు వాక్సిన్ వచ్చింది.

అలాగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా దాదాపు అందరికి పూర్తవబోతుంది.ఈ క్రమంలో ఇదే మంచి తరుణమని భావించి మళ్ళీ ఆఫీస్ లోనే ఉద్యోగులతో ఉద్యోగాలు చేయించాలని సదరు కంపెనీల యజమానులు అనుకుంటున్నారట.

Advertisement

కానీ ఈ నిర్ణయం పట్ల ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి నెలకొందని తెలుస్తుంది.ప్రముఖ ఇంటర్నెట్‌ కంపెనీలు అయిన యాపిల్‌, గూగుల్‌ సంస్థలు వాళ్ళ ఎంప్లాయిస్‌ కు ఇప్పటికే ఆఫీస్‌ లకు వచ్చి ఉద్యోగాలు చేయాలనీ మెయిల్స్‌ కూడా పెడుతున్నారట.

అలాగే ఉద్యోగులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు కూడా సమాచారం.చాలా మంది ఉద్యోగులు తాము వర్క్‌ ఫ్రమ్‌ హోంలోనే ఉద్యోగం చేస్తామని, మరి ఇలా ఆఫీస్‌ లకు వచ్చి జాబ్ చేయాలనీ పట్టుబడితే రాజీనామాలు చేయడానికి కూడా మేము సిద్ధం అని అంటున్నారట.

అయితే వీళ్ళకి రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి గూగుల్ కూడా కసరత్తలు చేస్తుంది.ఈ క్రమంలో లోనే కంపెనీ ఉద్యోగుల కోసం ఓ పే కాలిక్యూలేటర్ సిద్ధం చేస్తోంది.ఈ కాలిక్యులేటర్ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో కోతలు కోయాలని గూగుల్ నిర్ణయించింది.

ఒక్క గూగుల్ మాత్రమే కాదు.అటు ఫేస్ బుక్, ట్విట్టర్ కంపెనీలలో కూడా ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఇకపై ఉద్యోగులు పనిచేసే లొకేషన్ ను బట్టి వేతనం చెల్లించనున్నారు.కంపనీలో పని చేసేవారికి, కంపనీకి దూరంగా పనిచేసే వారి జీతాల్లో 10 శాతం తేడా ఉంటుందట.

Advertisement

గూగుల్ కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మే నెలలోనే హైబ్రిడ్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ ను ప్రవేశ పెట్టారు.దానిలో భాగంగా సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి 60% ఉద్యోగులు ఆఫీస్‌ లలో వర్క్ చేయాలనీ, అలాగే 20 శాతం మంది రిమోట్‌ వర్క్‌ చేయాలనీ, మిగిలిన 20 శాతం మంది కంపనీలో రీ లోకేట్‌ కావాలని పిచాయ్‌ పిలుపు ఇచ్చాడు.వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు