యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు శరవేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అడాప్ట్ చేసుకుంటున్నాయి.గూగుల్ తన పోటీదారుల కంటే ముందంజలో ఉండటానికి సెర్చ్ జనరేటివ్ ఎక్స్‌పీరియన్స్ (SGE), AI చాట్‌బాట్ బార్డ్ వంటి కొత్త AI-బేస్డ్ ఫీచర్లు, ప్రొడక్ట్స్ విడుదల చేస్తోంది.
తాజాగా గూగుల్ తన గూగుల్ మ్యాప్స్( Google Maps ) అప్లికేషన్‌లో పలు రకాల ఏఐ ఫీచర్లను అందించి దానిని మరింత మెరుగుపరిచింది.
గూగుల్ మ్యాప్స్ రూట్‌ల కోసం తాజాగా “ఇమ్మర్సివ్ వ్యూ”( Immersive View ) ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులు ఏదైనా ప్రదేశానికి వెళ్లే ముందు ఆ ప్రదేశం యొక్క 3D మోడల్‌ని చూడటానికి అనుమతిస్తుంది.
ఇది మెరుగైన డ్రైవింగ్ డైరెక్షన్స్, మ్యాప్స్‌లో గూగుల్ లెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ అవైలబిలిటీ వంటి ఇతర ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది.వినియోగదారులు వారి పర్యటనలను మరింత సులభంగా ప్లాన్ చేయడం, నావిగేట్ చేయడం, పర్యావరణ అనుకూల ఎంపికలు చేయడం, ఎంజాయ్ చేయవలసిన కొత్త విషయాలను కనుగొనడంలో సహాయపడటానికి ఈ ఫీచర్‌లు రూపొందించబడ్డాయి.

మార్గాల కోసం ఇమ్మర్సివ్ వ్యూ ఈ సంవత్సరం గూగుల్ I/O సమావేశంలో మొదటిసారిగా ప్రకటించడం జరిగింది.కాగా ఇది ఇప్పుడు ప్రపంచంలోని ఆమ్‌స్టర్‌డామ్, బార్సిలోనా, డబ్లిన్, ఫ్లోరెన్స్, లాస్ వేగాస్, లండన్, లాస్ ఏంజెల్స్, మయామి, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, సీటెల్, టోక్యో, వెనిస్ వంటి కొన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.వినియోగదారులు దీన్ని ఆండ్రాయిడ్,( Android ) ఐఓఎస్( IOS ) పరికరాలలో యాక్సెస్ చేయవచ్చు.

మార్గాల కోసం ఇమ్మర్సివ్ వ్యూ ఉపయోగించడానికి, వినియోగదారులు గూగుల్ మ్యాప్స్‌ని తెరిచి, సపోర్ట్ ఉన్న నగరాల్లో ఒకదానిలో గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి.అప్పుడు వారు మ్యాప్ రైట్ బిలో కార్నర్‌లో “ఇమ్మర్సివ్ వ్యూ” అని చెప్పే చిన్న బటన్‌ను చూస్తారు.ఈ బటన్‌ను నొక్కడం ద్వారా, వారు ఇమ్మర్సివ్ వ్యూ మోడ్‌లోకి ప్రవేశించవచ్చు, అక్కడ వారు తమ ఫోన్‌ని తరలించి వారు వెళ్లే మార్గంలోని వివిధ కోణాలను చూడవచ్చు.