విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ వాయిదా

విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను డిసెంబర్ 15వ తేదీకి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

 Kodikatthi Case Hearing Adjourned In Visakha Nia Court-TeluguStop.com

కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ పై వారం రోజుల్లో తీర్పు వస్తుందని శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ తెలిపారు.

ఇటువంటి కేసులో ఐదేళ్లు శిక్ష పడటం ఎక్కడా జరగలేదన్నారు.అదేవిధంగా కేసులో వైఎస్ జగన్ వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కోణం వలనే ఏళ్ల తరబడి కేసు కొనసాగుతుందని లాయర్ సలీమ్ పేర్కొన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కోడికత్తి కేసు విచారణపై హైకోర్టు విధించిన ఎనిమిది వారాల స్టే రద్దు చేయడానికి పిటిషన్ వేస్తామని తెలిపారు.

అయితే కోడికత్తి కేసుపై సమగ్ర విచారణ చేయాలని వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం ఎనిమిది వారాల పాటు స్టే విధించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube