బంపర్ ఆఫర్: "బగ్" కనిపెట్టండి... 24 లక్షలు పొందండి!

సాధారణంగా మీరు ఏదైనా వెబ్ సైట్ చూసినపుడు, లేదంటే మొబైల్ యాప్స్ వాడే క్రమంలో అందులో వున్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా గుర్తించగలరా? అయితే మీరే బగ్ హంటర్!( Bug Hunter ) ఇపుడు మీలాంటి వాళ్ళ కోసమే చాలా ఏళ్లుగా గూగుల్ ‘బగ్ బౌంటీ’( Bug Bounty ) ప్రోగ్రాం నిర్వహిస్తోంది.బగ్ అంటే ఏంటనే విషయం చాలామందికి ఓ అనుమానం రావచ్చు.

 Google Announced Bug Bounty Program With 24 Lakhs Reward Details, Bumper Offer,-TeluguStop.com

బగ్ అంటే యాప్, లేదంటే వెబ్ సైట్లో ఉన్న లోపం అని అనుకోవచ్చు.ఇక బౌంటీ అంటే బహుమానం… ఆయా లోపాలు కనిపెట్టిన వారికి ఆయా సంస్థలు నగదు రూపంలో బహుమానాలు ఇస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే గూగుల్ యాప్స్ లోని( Google Apps ) బగ్స్ ను గుర్తించి చెప్పే వాళ్లకు లక్షలాది రూపాయల రివార్డ్స్ ను గూగుల్ ఇస్తూ వస్తోంది.ఇప్పటి వరకు ఈ అమౌంట్ ఎంత అనే దానిపై ఎవరికీ పూర్తి క్లారిటీ లేదుగాని కాస్త ఎక్కువగానే ఇస్తారని చెప్పుకోవచ్చు.తాజాగా గూగుల్ వీటిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది.గూగుల్ యాప్స్ లో ఏ రేంజ్ బగ్స్ గుర్తిస్తే.ఎంత వరకు బౌంటీ ఇస్తారనేది తాజాగా వెల్లడించడం విశేషం.

గూగుల్ తన ఆండ్రాయిడ్ యాప్‌లలో బగ్స్ గుర్తించే వాళ్లకు బహుమానం అక్షరాలా 24 లక్షలు ఇస్తానని ప్రకటించింది.కాగా గూగుల్ అనౌన్స్ చేసిన ప్రోగ్రాం పేరు “మొబైల్ వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్” (మొబైల్ VRP).గూగుల్ డెవలప్ చేసిన లేదా గూగుల్ నిర్వహించే యాప్‌లలో బగ్స్ ను గుర్తించే వాళ్ళకి ఈ ప్రోగ్రాం కింద బహుమానం ఇస్తారన్నమాట.ఈ నేపథ్యంలోనే గూగుల్ తమ యాప్స్ లో హెవీ రిస్క్ కలిగిన బగ్స్ ను దొరకబడితే రూ.62వేల నుంచి, రూ.24 లక్షల వరకు రివార్డ్ ఇవ్వనుంది.అదనంగా రూ.80వేల బోనస్ కూడా ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube