యూపీఐ పేమెంట్స్ చేసే వారికి గుడ్ న్యూస్

ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడుతున్నారు.రోడ్డు పక్కన ఉండే చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ పేమెంట్లు చకచకా చేస్తున్నారు.

 Good News For Those Who Make Upi Payments Upi Payments,good News, Viral, Latest-TeluguStop.com

అయితే పిన్ నంబర్ ఎంటర్ చేయడం, యూపీఐ పేమెంట్లు పూర్తయ్యే వరకు వేచి చూడడం ఒక్కోసారి సమస్యగా ఉంటోంది.దీనికి పరిష్కారంగా యూపీఐ పేమెంట్లు మరింత వేగంగా పూర్తయ్యేలా కొత్త విధానం వచ్చింది.

తక్కువ మొత్తంలో చేసే పేమెంట్ల కోసం యూపీఐ లైట్‌ను ఆర్‌బీఐ తీసుకొచ్చింది.UPI లైట్ అనేది ఆన్-డివైజ్ వాలెట్ ఫీచర్.యూపీఐ పిన్‌ని ఉపయోగించకుండా రూ.200 వరకు చెల్లింపులు చేయొచ్చు.

UPI లైట్( UPI Lite ) అనేది ‘ఆన్-డివైస్ వాలెట్‘.UPI లైట్‌ని ఉపయోగించడానికి కస్టమర్‌లు తమ బ్యాంక్ ఖాతాల నుండి యాప్‌లోని వాలెట్‌కి డబ్బులను పంపించుకోవాలి.

ఇది ‘ఆన్-డివైస్ వాలెట్’ కాబట్టి, కస్టమర్లకు ఇంటర్నెట్ అవసరం లేదు.యూపీఐ లైట్ చిన్న మొత్తంలో చేసే లావాదేవీల కోసం రూపొందించారు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం UPI లైట్ లావాదేవీ గరిష్ట పరిమితి రూ.200.UPI లైట్ బ్యాలెన్స్ మొత్తం పరిమితి ఏ సమయంలోనైనా రూ.2,000గా ఉంటుంది.UPI లైట్‌ సాయంతో ఒక రోజులో అపరిమిత లావాదేవీలను కూడా నిర్వహించవచ్చు.

ప్రస్తుతం ఈ సదుపాయం కొన్ని బ్యాంకులకే ఉంది.వాటిలో కెనరా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్( HDFC Bank ), ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎన్‌పిసిఐ వంటి బ్యాంకులు యుపిఐ లైట్ ఫీచర్‌ అందిస్తున్నాయి.ఇక్కడ కస్టమర్‌లు లావాదేవీలను డెబిట్, క్రెడిట్ రెండింటిని పూర్తి ఆఫ్‌లైన్ మోడ్‌లో ప్రాసెస్ చేయవచ్చు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube