యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇక త్వరగా డబ్బులు

మీకు యూట్యూబ్ ఛానెల్ ఉందా.? సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని( YouTube channel ) నడుపుతున్నారా? అయితే మీకు యూట్యూబ్ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది.

కంటెంట్ క్రియేటర్ల కోసం మానిటైజేషన్‌కు సంబంధించిన నిబంధనలను ఇటీవల యూట్యూబ్ సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

దీని వల్ల యూట్యూబ్ నడిపే యజమానులకు మరింత సులువు కానుంది.కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల విషయానికొస్తే.

గతంలో వెయ్యి మంది సబ్‌స్కైబర్లు( Subscribers ) ఉంటే మాత్రమే మీ యూట్యూబ్ ఛానెల్‌కి మానిటైజేషన్ వచ్చేది.అలాగే 4 వేల గంటల వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ షార్ట్స్ వీడియో( 10 Million Shorts Video ) వ్యూస్ వచ్చి ఉండాలి.దీంతో చిన్న యూట్యూబ్ ఛానెల్ నడిపే కంటెంట్ క్రియేటర్లకు ఆదాయం లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

వెయ్యి మంది సబ్‌స్కైబర్లు రావడంతో పాటు 4 వేల గంటలు చూసి తర్వాత మానిటైజేషన్ ( Monetization )రావడానికి చాలా సమయం పడుతుంది.ఇలాంటి చిన్న యూట్యూబర్ల సమస్యలను అర్థం చేసుకున్న యూట్యూబ్.

Advertisement

తాజాగా నిబంధనలను మార్చింది.

తాజాగా వచ్చిన రూల్స్ ప్రకారం 500 మంది సబ్‌స్కైబర్లతో పాటు 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ వీడియోలను పబ్లిష్ చేసి ఉండాలి.అలాగే ఏడాదిలో మూడు వేల మంది వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్ల షార్ట్ వీడియోస్ కు వ్యూస్ ఉండాలి.ఈ అర్హతలు ఉంటే మీ యూట్యూబ్ ఛానెల్‌కి మానిటైజేషన్ వస్తుంది.

ప్రస్తుతం అమెరికా, కెనడా, తైవాన్, దక్షిణకొరియా.యూకే దేశాల్లో మాత్రమే ఈ కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది.

త్వరలో అన్ని దేశాల్లో దీనికి అమల్లోకి తీసుకురానుందని తెలుస్తోంది.ఇండియాలో కొద్దిరోజుల్లోనే ఈ రూల్స్ తీసుకురానుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీంతో కొత్తగా యూట్యూబ్‌ఛానెల్ పెట్టాలనుకునువారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు