నిరుద్యోగులకు శుభవార్త... ఏప్రిల్ 1 నుంచి డైరెక్ట్ గా అకౌంట్‌లోకి డబ్బులు వచ్చి పడతాయ్!

మన దేశంలో ప్రతి ఏటా పెరిగిపోతున్న జనాభాతోపాటు, నిరుద్యోగుల సంఖ్య కూడా దారుణంగా పెరిగిపోతోంది.

ప్రతి సంవత్సరం వివిధ యూనివర్సిటీల నుంచి చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వారి సంఖ్య భారీగా ఉండగా, చదివిన అందరికీ ఇక్కడ ఉద్యోగాలు లభించని పరిస్థితి.

దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్(Government of Chhattisgarh ) ఎన్నికల సమయంలో ఉద్యోగం లేని యువతకు నిరుద్యోగ భృతి ( unemployment allowance )ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే.కాగా అది ఇప్పుడు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది.

అవును, ఏప్రిల్ 01 నుంచి నిరుద్యోగ యువతకు రూ.2,500 నిరుద్యోగ భృతి అందించనుంది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.దీనికోసం ఏకంగా రూ.250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించడం విశేషం.ఇది మాత్రమే కాకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, హౌస్‌గార్డులు, గ్రామ కొత్వార్‌లు, ఇతర ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది.

అయితే నిరుద్యోగ భృతికి కొన్ని నియమనిబంధనలు అనేవి ఉండాలి.ఇందుకోసం మొదట ఛత్తీస్‌గడ్ నివాసితులై ఉండాలి.అంతే కాకుండా 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న యువకులు దీనికి అర్హులు.అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి.

Advertisement

అంతేకాకుండా నిరుద్యోగ యువత ఛత్తీస్‌గడ్‌లోని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గైడెన్స్ సెంటర్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకుని ఉండాలి.ఏప్రిల్ 1 నాటికి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ రెండేళ్లుగా వుంది తీరాలి.ఇవన్నీ ఉన్నప్పుడే మీరు నిరుద్యోగ భృతికి అర్హత పొందుతారు.నిరుద్యోగ యువతకు( Unemployment ) పైన చెప్పిన అన్ని అర్హతలు, అదే సమయంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుని ఉన్నప్పుడే నెలకు రూ.2,500 లభిస్తుంది.ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి జమ అవుతుంది.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు