ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ 10 సేవలు ఉచితం

భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI అంటే ప్రజల్లో నమ్మకం ఎక్కువ.

ఇది తన ఖాతాదారులకు ఎన్నో విలువైన సేవలు ఉచితంగా అందిస్తోంది.

SBI క్విక్ యాప్ సాయంతో మీరు ఎన్నో సేవలు క్షణాల్లో పొందొచ్చు.ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా ఖాతాలో బ్యాలెన్స్, మినీ-స్టేట్‌మెంట్, చెక్ బుక్ వంటి ఎన్నో సేవలు ఉచితంగా పొందే వీలుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులైతే SBI క్విక్ యాప్( SBI Quick ) ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దీని ద్వారా ఎన్నో సేవలు పొందొచ్చు.అందుకు "REG" టైప్ చేసి 7208933148కి ఎస్ఎంఎస్ పంపించాలి.

Advertisement

మీ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునేందుకు “BAL” అని టైప్ చేసి 9223766666కి ఎస్ఎంఎస్ పంపించాలి.మల్టీ ఆప్షన్ డిపాజిట్స్ ( MOD ) గురించి తెలుసుకునేందుకు "MODBAL" అని టైప్ చేసి 9223766666కి పంపించాలి.

గత 5 లావాదేవీల గురించి తెలుసుకునేందుకు 9223866666 నంబరుకు “MSTMT” అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపించాలి.మీకు చెక్ బుక్ అవసరం అయితే 917208933145కు “CHQREQ” అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

తర్వాత SMS అందుకున్న 2 గంటలలోపు 917208933145కు మీ కన్సెంట్ SMS (SMSలో CHQACCY6 అంకెల సంఖ్య) పంపాల్సి ఉంటుంది.

మీకు గత ఆరు నెలల వ్యవధికి చెందిన బ్యాంకు స్టేట్‌మెంట్ కావాలంటే ESTMT అని టైప్ చేసి, ఇచ్చి నంబరు టైప్ చేసి, ఇచ్చి ను ఎంటర్ చేసి 7208933145కు ఎస్ఎంఎస్ పంపించాలి.మీరు ఎంచుకున్న కోడ్ మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ చిరునామాకు ఎన్‌క్రిప్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.ఎడ్యుకేషన్ లోన్( Education Loan ) ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కావాలంటే EL code నమోదు చేసిన తర్వాత 7208933145కు ఎస్ఎంఎస్ పంపించాలి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఇవే కాకుండా లోన్ సర్వీస్ కోసం కొన్ని నంబర్లకు ఎస్ఎంఎస్ పంపించి వివరాలు పొందొచ్చు.హోమ్ లోన్ కోసం 917208933140 నంబరుకు, కార్ లోన్ కోసం 917208933141నంబరుకు, గోల్డ్ లోన్ కోసం 917208933143 నంబరుకు, పర్సనల్ లోన్ కోసం 917208933142 నంబరుకు, SME లోన్ కోసం 917208933144 నంబరుకు ఎస్ఎంఎస్ చేసి వివరాలు పొందొచ్చు.

Advertisement

తాజా వార్తలు