మ్యాక్‌ యూజర్లకు శుభవార్త... ఇకనుండి ఫ్రీగా అవుట్‌లుక్ సేవలు!

దిగ్గజ మైక్రోసాఫ్ట్‌, తమ సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్టులకు వరుస అప్‌డేట్స్ అందిస్తూ వినియోగదారులను ఖుషి చేస్తోంది.ఈ మధ్యనే నోట్‌ప్యాడ్‌లో ట్యాబ్స్, ఏఐ పవర్డ్‌ బింగ్‌ సెర్చ్‌, ఎడ్జ్‌ బ్రౌజర్‌లను లాంచ్‌ చేసిన సంగతి విదితమే.

 Good News For Mac Users Outlook Services Are Now Free-TeluguStop.com

కాగా ఇప్పుడు మ్యాక్‌ వినియోగదారులకు ఓ సూపర్ న్యూస్‌ అందజేసింది.అవును, మ్యాక్‌లలో ఇప్పుడు అవుట్‌లుక్‌ అప్లికేషన్‌ను ఫ్రీగా యూజ్‌ చేసుకోవచ్చని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

దీనివలన వినియోగదారుకు ఇక మైక్రోసాఫ్ట్‌ 365 సబ్‌స్క్రిప్షన్ లేదా లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే, మ్యాక్‌ యాప్‌ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ ఉచితంగా లభిస్తుంది.ఇకపోతే… యూనిఫైడ్‌ ఇన్‌బాక్స్‌, యూనివర్సెల్‌ సెర్చ్‌ ఫంక్షనాలిటీతో అవుట్‌లుక్‌.కామ్‌, ఐక్లౌడ్‌, జీమెయిల్‌, యాహూ మెయిల్‌ వంటి వివిధ ఇమెయిల్‌ ప్రొవైడర్స్‌కు అవుట్‌లుక్‌ సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.

ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం.మ్యాక్‌ కోసం యాప్‌ను యాపిల్‌ సిలికాన్ చిప్‌లతో ఆప్టిమైజ్ చేసింది.

మైక్రోసాఫ్ట్ 2020లో మ్యాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో అవుట్‌లుక్‌ని రీడిజైన్ చేయడం జరిగింది.యాప్ నోటిఫికేషన్ సెంటర్ విడ్జెట్‌లకు, MacOS, iOS మధ్య హ్యాండ్‌ఆఫ్‌ వంటి వాటికి సపోర్ట్‌ చేస్తుంది.

ఇపుడు ఐవోఎస్‌ తరహాలోనే మ్యాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో అవుట్‌లుక్‌ సేవలను అందిస్తోంది.చాలా మంది ఇష్టపడే యాపిల్‌ ఎకో సిస్టమ్‌లోకి అవుట్‌లుక్‌ అత్యుత్తమ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.ఇది మునుపటి వెర్షన్‌ల కంటే మెరుగైన పనితీరుని ప్రదర్శిస్తుంది.సాఫ్ట్‌వేర్ తయారీదారు త్వరలో రానున్న కొత్త అవుట్‌లుక్‌ ప్రొఫైల్‌లతో ఆపిల్ ఫోకస్ ఎక్స్‌పీరియన్స్‌కు సపోర్ట్‌ ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తోంది.

ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా ఇమెయిల్, క్యాలెండర్‌ టాప్‌లో ఉండేలా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube