టీం ఇండియా ఆల్‌రౌండర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది హార్దిక్ పాండ్యా.తనదైన ఆటతీరుతో మనోడు క్రికెట్ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలో తాజగా హార్దిక్ పాండ్య అరుదైన ఘనత సాధించాడు.విషయం ఏమంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న యంగెస్ట్ క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు.
ఈ ఘనతతో ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా పాండ్యా రికార్డులకు ఎక్కడం అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య దిగ్గజ క్రీడాకారులను సైతం వెనక్కి నెట్టాడు.టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లు అయినటువంటి రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, డచ్ రేసింగ్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ వంటి హేమాహేమీల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని హార్దిక్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.ఈ సందర్భంగా హార్దిక్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టు పెట్టడం గమనించవచ్చు.
కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హార్దిక్ పాండ్య పోస్ట్ ఈ విధంగా వుంది… “నాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.నా అభిమానులకు ఎంతో రుణపడి వుంటాను.ఈ సందర్భంగా ప్రతి ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకంగా నిలిచారు.
ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కిరికీ శతకోటి ధన్యవాదాలు!” అని పాండ్యా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో అభిమానులు ఆనంద బాష్పాలు కారుస్తున్నారు.ప్రస్తుతం ఇన్‌స్టాలో పాండ్యాకు 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అంటే 25 కోట్ల మంది ఫ్యాన్స్‌ను మనోడు సంపాదించుకున్నాడు.







