Kia Cars : కార్లు కొనాలనుకొనేవారికి గుడ్ న్యూస్... Kia కార్లు ఇకనుండి తక్కువ ధరలకే?

మీరు తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.కియా మోటార్స్ తాజాగా కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

అవును, ఇపుడు కియా మోటార్స్ సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలో కొత్త షోరూమ్స్‌ను ఓపెన్ చేసింది.

వీటిని కియా CPO అని పిలుస్తారు.ఇందులో సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రమే ఉంటాయి.

కియా సెకండ్ హ్యాండ్ కార్లు, అలాగే ఇతర కంపెనీలకు చెందిన సెకండ్ హ్యాండ్ కార్లు కూడా ఈ CPOలో ఉంటాయి.మీరు కియా CPO ద్వారా పాత కారును విక్రయించొచ్చు, అలాగే పాత కారును కొనొచ్చు కూడా.

Advertisement

ఇక్కడ గమనించదగ్గ ఇంకో విషయం ఏమంటే పాత కారు ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు.అంటే పాత కారు ఇచ్చి కొత్త కియా మోడల్ పొందవచ్చు.

కొరియాకు చెందిన కియా మన దేశంలో మూడేళ్ళ క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి విదితమే.ఇపుడు దేశంలో ఫాస్టెస్ట్ కార్ బ్రాండ్‌గా కియా కొనసాగుతోందని కంపెనీ పేర్కొంటోంది.

కియా CPO ద్వారా కస్టమర్లకు రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది.లేదంటే గరిష్టంగా 40 వేల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది.

ఇంకా ఈ కియా సీపీవోలో నాన్ కియా మోడల్స్ కూడా అందుబాటులో ఉంటయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అంతేకాకుండా ఈ కార్లకు 175 పాయింట్ క్వాలిటీ చెక్ కూడా నిర్వహించడం జరుగుతుంది.కియా CPO ద్వారా కొనే మోడళ్లకు స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటూ ఏమీ ఉండదు అని గుర్తుపోఎట్టుకోవాలి.వెహికల్ హిస్టరీ పొందొచ్చు.

Advertisement

నాన్ కియా కార్లను కూడా వీటి ద్వారా విక్రయిస్తారు.కాగా కియా కంపెనీ దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో 15 ఔట్‌లెట్స్ వున్న సంగతి విదితమే.

అయితే వీటిని మరింత విస్తరించనున్నారు.ఈ ఏడాది చివరకు ఈ సంఖ్యను 30 చేర్చాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

తాజా వార్తలు