కండ‌రాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఇవి తినాల్సిందే!

కండ‌రాల నొప్పులు.దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఫేస్ చేసిన స‌మ‌స్యే ఇది.

అందులోనూ ముప్పై ఏళ్లు దాటిన వారిలో అత్య‌ధికంగా ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.కండ‌రాలు బ‌ల‌హీనంగా మార‌డం, డీహైడ్రేషన్, శారీరక శ్రమ లేక పోవడం, గర్భధారణ, వేడిలో వ్యాయామాలు చేయ‌డం, కొన్ని రకాల మందుల వాడకం, పోష‌కాల లోపం, మితిమీరిన శారీర‌క శ్ర‌మ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కండ‌రాల నొప్పి పుడుతూ ఉంటాయి.

ఇదేమి పెద్ద ప్రమాదకర‌మైన స‌మ‌స్య కాన‌ప్ప‌టికీ.తీవ్రమైన నొప్పి మ‌రియు అసౌక‌ర్యానికి గురి చేస్తుంటుంది.అందుకే కండ‌రాల నొప్పుల‌ను నివారించుకునేందుకు త‌ర‌చూ పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు.

అయితే కొన్ని కొన్ని ఆహారాల‌తో కూడా ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు.మ‌రి ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.

బొప్పాయి.ఆరోగ్య ప‌రంగా ఈ పండు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.అయితే కండ‌రాల స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలోనూ బొప్పాయి స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

ప్ర‌తి రోజు ఒక క‌ప్పు బొప్పాయి ముక్క‌లు తీసుకుంటే.బ‌ల‌హీన‌మైన కండ‌రాలు బ‌లంగా మారి త‌ర‌చూ నొప్పి పుట్టుకుండా ఉంటాయి.

శ‌రీరంలో ప్రోటీన్ స‌రిప‌డా లేక‌పోయినా త‌ర‌చూ కండ‌రాల నొప్పులు బాధిస్తాయి.అందుకే పాలు, మాంసం, చేప, గుడ్లు, పెరుగు, ఆకుకూర‌లు, బీన్స్, పప్పుధాన్యాలు మొదలైనవి తీసుకుంటే మంచిది.

కండ‌రాల‌ను బ‌లంగా మార్చ‌డంలోనూ, వాటి ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ అర‌టి పండు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.రెగ్య‌లర్‌గా ఒక అర‌టి పండు తీసుకుంటే.

కండరాల నొప్పిని తగ్గించడానికి అవసరమైన కాల్షియం మరియు మెగ్నీషియంలు శ‌రీరానికి పుష్క‌లంగా అందుతాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఆకుకూర‌లు కూడా కండ‌రాల నొప్పుల‌ను నివారించ‌ గ‌ల‌వు.ముఖ్యంగా పాల‌కూర‌, మెంతికూర‌, బ్రొకోలీ వంటివి త‌ర‌చూ తీసుకుంటే.వాటిలో ఉండే పోష‌క విలువ‌లు కండరాల నొప్పిని నిరోధించడానికి సహాయపడతాయి.

Advertisement

ఇక ఈ ఆహారాల‌తో పాటుగా ప్ర‌తి రోజు చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తుండాలి.ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూనెలో వేయించిన ఆహారాలు, బేకరీ ఉత్పత్తుల‌కు దూరంగా ఉండాలి.మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి అల‌వాట్ల‌ను నివారించుకోవాలి.

తాజా వార్తలు