ఈ మధ్య కాలంలో గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్పేస్ ( Green certified office space )కి మంచి గిరాకీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు.ఈ క్రమంలోనే పర్యావరణ అనుకూల ఆఫీస్ స్పేస్ దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో గడిచిన మూడున్నరేళ్లలో 36 శాతం పెరిగి 342 చదరపు అడుగులకు చేరుకుందని సమాచారం.2019 నాటికి గ్రీన్ ఆఫీస్ స్పేస్ 251 మిలియన్ చదరపు అడుగులుగా మాత్రమే ఉంది.కాగా ఆయా వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ, వాణిజ్య సంఘం సీఐఐ సంయుక్తంగా ఓ నివేదిక రూపంలో ఈ విషయాలను తెలియజేశాయి.

దేశీయంగా చూసుకున్నా అంతర్జాతీయంగా( Internationally ) చూసుకున్నా ఆధునిక, ప్రీమియం, పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులకు ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్ పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.ఈ సందర్బంగా సీబీఆర్‌ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్( CBRE Chairman and CEO Anshuman ) మాట్లాడుతూ… “ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే రియల్ ఎస్టేట్ దానికదే వృద్ధి చెందుతుంది.ఆధునిక, టెక్నాలజీ ఆధారిత, పర్యావరణ అనుకూల వసతులకు రానున్న త్రైమాసికంలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.” అంటూ చెప్పుకొచ్చారు.దేశవ్యాప్తంగా 2023 జూన్ నాటికి పర్యావరణ అనుకూల కార్యాలయ వసతుల్లో 68 శాతం బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబైలోనే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.

కాగా హైదరాబాద్‌లో 51.9 మిలియన్ చదరపు అడుగుల మేర పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులు ఉంటే, బెంగళూరులో 104.5 మిలియన్ చదరపు అడుగులు, ముంబైలో 56.6 మిలియన్లు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 70.2 మిలియన్లు, పుణెలో 26.2 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 32.6 మిలియన్ల చొప్పున ఈ వసతులు ఉన్నట్టు వెల్లడించింది.పర్యావరణ అనుకూల, ఇంధన ఆదా కార్యాలయ భవనాలకు దేశీ, బహుళజాతి కంపెనీల నుంచి డిమాండ్ పెరిగినట్టు అర్బన్ వోల్ట్ సహ వ్యవస్థాపకులు అమల్ మిశ్రా ఈ నివేదికలో పేర్కొన్నారు.







