వైరల్: ఆకాశంనుండి నదిలోకి బంగారు రంగులో నీటి ధార ప్రవహిస్తోంది... కావాలంటే చూడండి!

ప్రకృతి అందాలను అభివర్ణించడం కవికైనా సాధ్యం కాదు.ఈ అనంత ప్రకృతి ఒడిలో సకల జీవరాశి నివసిస్తోంది.

 Golden Waterspout On Russias Kama River Video Viral Details, Viral, Viral Latest-TeluguStop.com

అనేక అద్భుతాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి.నింగికి, నేలకి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది.

వాటిని తెలియజేసే విధంగా ఇక్కడ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అయితే అన్నివేళలా ఆ దృశ్యాలు చూడడం సాధ్యం కాదు.

చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి చోటుచేసుకుంటాయి.సోషల్ మీడియా ఇపుడు బాగా ప్రబలడంతో అలాంటి దృశ్యాలను మనం నేరుగా కాకపోయినా ఇలా నెట్టింట్లోనైనా చూసే భాగ్యం కలుగుతోంది.

అవును, అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూపించే వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్ కావడం మనం గమనించవచ్చు.

ఈ దృశ్యం రష్యాలోని( Russia ) పర్మ్ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.ఆ ప్రాంతంలో కామ నది( Kama River ) అని ఒకటుంది.దాని ఉపరితలంపై అద్భుతమైన నీటి ధార బంగారు వర్ణంలో( Golden Waterspout ) మెరిసిపోతూ కనిపించడం ఇక్కడ చూడవచ్చు.

పడవలో వెళ్తున్న ప్రయాణికులను ఆ విజువల్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.దాంతో అందులో ఉన్నవారిలో ఒకరు ఈ వీడియోను వారు క్యాప్చర్ చేయడం జరిగింది.దాంతో ఓ ట్విట్టర్ యూజర్ ‘ప్రకృతి మరియు మనస్తత్వం మధ్య కొంచెం తేడా ఉంది… కామ నది.పెర్మ్ ప్రాంతం.జూలై 13, 2023′ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే, ఇలాంటి నీటి ధార అనేది సాధారణంగా సుడిగాలి వల్ల సముద్ర ఉపరితలాలపై ఏర్పడతాయి అని నిపుణులు చెబుతున్నారు.అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయని అంటున్నారు.మరీ ముఖ్యంగా యూరప్, మిడిల్ – ఈస్ట్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాతో సహా పలుప్రాంతాల్లో ఇలాంటి చాలా అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి అని అంటున్నారు.ఇక ఈ వీడియోని చుసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘అద్భుతంగా ఉంది!’ అని కొందరంటే, ‘ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు ‘ఇది నిజమేనా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube