వైరల్: ఆకాశంనుండి నదిలోకి బంగారు రంగులో నీటి ధార ప్రవహిస్తోంది… కావాలంటే చూడండి!

ప్రకృతి అందాలను అభివర్ణించడం కవికైనా సాధ్యం కాదు.ఈ అనంత ప్రకృతి ఒడిలో సకల జీవరాశి నివసిస్తోంది.

అనేక అద్భుతాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి.నింగికి, నేలకి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది.

వాటిని తెలియజేసే విధంగా ఇక్కడ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అయితే అన్నివేళలా ఆ దృశ్యాలు చూడడం సాధ్యం కాదు.

చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి చోటుచేసుకుంటాయి.సోషల్ మీడియా ఇపుడు బాగా ప్రబలడంతో అలాంటి దృశ్యాలను మనం నేరుగా కాకపోయినా ఇలా నెట్టింట్లోనైనా చూసే భాగ్యం కలుగుతోంది.

అవును, అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూపించే వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్ కావడం మనం గమనించవచ్చు.

"""/" / ఈ దృశ్యం రష్యాలోని( Russia ) పర్మ్ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.

ఆ ప్రాంతంలో కామ నది( Kama River ) అని ఒకటుంది.దాని ఉపరితలంపై అద్భుతమైన నీటి ధార బంగారు వర్ణంలో( Golden Waterspout ) మెరిసిపోతూ కనిపించడం ఇక్కడ చూడవచ్చు.

పడవలో వెళ్తున్న ప్రయాణికులను ఆ విజువల్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.దాంతో అందులో ఉన్నవారిలో ఒకరు ఈ వీడియోను వారు క్యాప్చర్ చేయడం జరిగింది.

దాంతో ఓ ట్విట్టర్ యూజర్ 'ప్రకృతి మరియు మనస్తత్వం మధ్య కొంచెం తేడా ఉంది… కామ నది.

పెర్మ్ ప్రాంతం.జూలై 13, 2023' అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

"""/" / ఇకపోతే, ఇలాంటి నీటి ధార అనేది సాధారణంగా సుడిగాలి వల్ల సముద్ర ఉపరితలాలపై ఏర్పడతాయి అని నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయని అంటున్నారు.మరీ ముఖ్యంగా యూరప్, మిడిల్ - ఈస్ట్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాతో సహా పలుప్రాంతాల్లో ఇలాంటి చాలా అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి అని అంటున్నారు.

ఇక ఈ వీడియోని చుసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.'అద్భుతంగా ఉంది!' అని కొందరంటే, 'ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది' అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు 'ఇది నిజమేనా?' అంటూ ఆశ్చర్యపోతున్నారు.

గంగా నదిలోకి దూకి దంపతులు ఆత్మహత్య.. వాళ్లు రాసిన లెటర్‌లో ఏముందో చదివితే..