ఒంటి నిండా బగారు చొక్కా తొడుక్కుని దాని పైన ఇంకా ఇంకా బంగారం పెట్టుకుని వేళ్లు , గోళ్ళు అనే తేడా లేకుండా బంగారం తో ఉండే బంగారు బాబు గుర్తు ఉన్నడా ? పూణే కి చెందిన ఇతను గోల్డ్ మ్యాన్ గా ఇప్పుడు అన్ని చోట్లా యమా పాపులర్.
ఇవాళ హత్యకి గురి అయ్యాడు ఈ బంగారు మనిషి.తెల్లవారు జామున అతన్ని గుర్తు తెలియని దుండగులు ఎవరో దారుణంగా హత్య చేయటం సంచలనంగా మారింది.3.5 కేజీల బంగారు చొక్కాను ధరించిన ఆయన ఫోటోల్ని దేశ వ్యాప్తంగా పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.రాళ్లతో కొట్టి.
బలమైన అయుధంతో ఆయనపై దాడి చేయటంతో ఈ గోల్డ్ మ్యాన్ మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఈ గోల్డ్ మ్యాన్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా చెబుతున్నారు.
వక్రతుండ చిట్ ఫండ్ పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన లెక్కల తేడానే ఆయన మరణానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.







