మీరు గోల్డ్ లోన్ గురించి వినే ఉంటారు.మీకు ఆకస్మికంగా డబ్బు అవసరమైతే, ఇంట్లో ఉంచిన బంగారం మీకు ఉపయోగపడుతుంది.
గోల్డ్ లోన్ ద్వారా, మీరు ఇంట్లో ఉంచిన బంగారంపై లోన్ తీసుకోవచ్చు.దేశంలో చాలా గోల్డ్ లోన్ కంపెనీలు ఉన్నాయి.
ఇవి మన ఇంట్లోని బంగారంపై రుణాలను అందజేస్తాయి.బంగారంపై రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ఏ బ్యాంకులో తీసుకోవాలో ఒక సారి ఆలోచించడం ఎంతో ముఖ్యం.
ఇప్పుడు వివిధ బ్యాంకులు బంగారం రుణాలపై విధించే వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా తక్కువ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
ఫెడరల్ బ్యాంక్ తన కస్టమర్లకు 6.99 శాతం వడ్డీ రేటుతో చౌకైన బంగారు రుణాన్ని అందిస్తోంది.దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ 7 శాతం వడ్డీతో బంగారు రుణాలను అందిస్తోంది.పంజాబ్ సింధ్ బ్యాంక్ కూడా 7 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణాన్ని అందిస్తోంది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 7.25 శాతం వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది.కెనరా బ్యాంక్‌లో 7.35 శాతం చొప్పున గోల్డ్ లోన్ అందుబాటులో ఉంది.ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు 8 శాతం గోల్డ్ లోన్ ఇస్తోంది.బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) 8.40 శాతం వద్ద గోల్డ్ లోన్ సౌకర్యాన్ని అందిస్తోంది.మీరు 8.49 శాతం రేటుతో కర్ణాటక బ్యాంక్ నుండి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.యూకో బ్యాంక్ నుండి 8.50 శాతం చొప్పున గోల్డ్ లోన్ లభిస్తుంది.మీరు 8.50 శాతం వడ్డీ రేటుతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుండి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.తాకట్టు పెట్టిన బంగారం విలువలో 75 శాతం వరకు సొమ్మును గోల్డ్ లోన్‌గా తీసుకోవచ్చు.
అలాగే మీ బంగారం స్వచ్ఛత, ఇతర ప్రమాణాలపై ఆధారపడి బంగారం వడ్డీ రేటును నిర్ణయిస్తుంటారు.







