పసిడి ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు..!

బంగారం.భారతీయులకు ఎంతో ఇష్టమైనది.ఇంట్లో డబ్బు ఉందంటే చిన్నదో పెద్దదో బంగారమే కొనాలనుకుంటారు.బంగారంకు అంత డిమాండ్ ఉంది.అలాంటి బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నాయ్.బంగారం ధరలు పెరగటానికి కోవిడ్ ఎలా అయితే కారణం అయ్యిందో బంగారం తగ్గటానికి కూడా కోవిడ్ ఏ కారణం.

 Gold And Silver Rate Decreased In India Gold Rate, Silver Rate, Decreased, Indi-TeluguStop.com

ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.దీంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు.బంగారం ధరలు భారీగా పెరిగాయ్.అయితే ఇప్పుడు కరోనా వైరస్ కి వ్యాక్సిన్ రావడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

దీంతో ఇన్వెస్టర్లు అంత కూడా ఇతర కంపెనీలపై ఇన్వెస్ట్ చేశారు.

నేడు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయ్.పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గుదలతో 55,670 రూపాయిలకు చేరింది.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గుదలతో 51,020 రూపాయలకు చేరింది.బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర కూడా భారీగా తగ్గింది.దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల తగ్గుదలతో 68,020 రూపాయలకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube