ప్రపంచంలోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవన శైలి పూర్తిగా మారిపోయింది.ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం సర్వసాధారణం అయిపోయింది.
కొంతమంది ప్రజలు చాలా విభిన్నంగా ఆలోచిస్తూ మాస్క్ లను వినియోగిస్తూ ఉండడం మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాం.వారి అతి తెలివితో విచిత్ర వైఖరిని తెలియజేస్తూ వినూత్న ఆలోచనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
సాధారణంగా కొంతమంది మాస్క్ లను కేవలం ఒక్క రోజు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.మరికొందరు అయితే రోజు వారువాడే మాస్క్ లను వాష్ చేసుకొని మరీ ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా మాస్క్ లను వారు రకరకాలుగా వినియోగించడం మనం గమనించవచ్చు.ఒకసారి వినియోగించిన మాస్క్ ను పక్కకు పడేయం ఇష్టం లేక ఎవరికి నచ్చిన రీతిలో వారు వినియోగిస్తున్నారు.
నెటిజెన్స్ ను అక్కట్టుకుంటున్న వీడియో ఆధారంగా కొంతమంది వారి మాస్క్ లను నీటిని పడకపోవడానికి ఉపయోగిస్తూ ఉంటే మరికొందరు వారి పిల్లలకు డైపర్లుగా వినియోగించడం మనం గమనించవచ్చు ఇక మహిళలైతే జడకొప్పుగా కూడా వాడారు అంటే నమ్మండి.అయితే కొంతమంది టీ వడపోయాడికి
వడపోసే జాలిగా, కాలికి సాక్స్‌లా
, పక్షులకు ఊయలాగా వాడారు.ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది మొత్తానికి ఈ ఫన్నీ వీడియో నెటిజెన్స్ ను ఎంత గానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.