బాహుబలి ఫైట్ సీన్‌ను రీక్రియేట్ చేసిన కోతి.. వీడియో వైరల్..

బాహుబలి సినిమాలో( Baahubali ) హీరో ప్రభాస్ చేసే యాక్షన్స్ సన్నివేశాలు చాలా బాగుంటాయి.ముఖ్యంగా ప్రభాస్ శరవేగంగా దూసుకుపోతున్న ఆవుల మందపైకి దూకి వాటిపై ఉరికే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

 Goat Carrying Monkey On Back Viral Video Details, Monkey, Viral Video, Babubali-TeluguStop.com

ఈ సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది.అయితే నిజజీవితంలో ఇలాంటి స్టంట్ మనుషులకు సాధ్యం కాదని కొందరు కొట్టి పడేసారు కూడా.

అయితే మనుషుల సంగతి ఏమో కానీ తాజాగా ఒక కోతి ( Monkey ) నిజ జీవితంలోనే ఈ స్టంట్‌ను రీ క్రియేట్ చేసి ఆశ్చర్యపరుస్తోంది.కాకపోతే ఇది ఆవుల మందపై కాకుండా.

మేకల మందపై( Goats ) దూకి వాటిపైన ఉరుకుతూ బాహుబలి స్టంట్‌ను గుర్తు చేసింది.

ఈ అబ్బురపరిచే ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) అశ్వరావుపేటలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోను మేకల మంద వెనకే వస్తున్న ఒక వ్యక్తి వీడియో తీశారు.

ఈ వీడియోలో ఒక రహదారిపై మేకల మంద వెళ్తూ ఉండటం చూడవచ్చు.ఈ మేకల మందలో ఒక మేకపై కోతి కూర్చొని ఉండటం కూడా గమనించవచ్చు.కొన్ని సెకన్ల తర్వాత ఆ కోతి ముందు ఉన్న మేకల మందపై పరిగెత్తుతూ అచ్చం బాహుబలి సన్నివేశాన్ని గుర్తు చేసింది.

బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసింది ఫేక్ కానీ ఇది రియల్ స్టంట్! అసలైన స్టంట్ మాస్టర్ అంటే ఈ కోతే అని ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.ఇకపోతే గతంలో కూడా కొన్ని కోతులు మానవులకు సాధ్యం కాని అద్భుతమైన స్టంట్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాయి.ఈ కోతులు ఆహారాన్ని దొంగలించే టైమ్‌లో కూడా తమ అద్భుతమైన స్టంట్ టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటాయి.

ఇక వైరల్ అవుతున్న వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube