పాము( snake ) కనిపిస్తే చాలు దాదాపు అందరూ భయంతో ఆమడ దూరం పరిగెడతారు.కానీ కొందరు మాత్రం వాటిని పట్టుకుని ఆడిస్తారు.
తాజాగా కొందరు యువకులు కూడా అదే పని చేశారు.ఓ పామును పట్టుకుని ఒక ఆట ఆడుకున్నారు.
వారి వల్ల పాము నరక యాతన అనుభవించింది.ఈ యువకులు పామును హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అది చూసిన నెటిజన్లు యువకుల తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు.మూగజీవాలను హింసించే ఇలాంటి వ్యక్తులను బాగా శిక్షించాలని కోరుతున్నారు.

వివరాల్లోకి వెళితే, యూపీ రాష్ట్రం, బారాబంకి సిటీలోని( Barabanki City, UP State ) అడవికి వద్దకు కొందరు యువకులు వెళ్లారు.అదే టైమ్లో అటువైపుగా ఒక నాగుపాము వెళ్తూ కనిపించింది.అంతే, దానిని వెంట బడి పట్టుకున్నారు.ఆపై ఒక యువకుడు పాము తోక పట్టుకుని దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు.అంతేకాదు, పక్కనే ఉన్న తోటి యువకుల వైపు పాము తీసుకెళ్లాడు. అది చూసి వారు వెనక్కి ఉరికారు.
ఈ వీడియోను ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక యూజర్ షేర్ చేస్తూ యూపీ ఫారెస్ట్ అఫీషియల్స్, లోకల్ పోలీసు డిపార్టును ట్యాగ్ చేశాడు.మరోవైపు ఈ వీడియో వైరల్గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాముతో ఆటలు ఆడటం, నిప్పుతో చెలగాటం ఆడినంత ప్రమాదమని, ఈ చేష్టల వల్ల వాటికి కూడా బాధ కలుగుతుంది.ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారో తెలియదు అని కొందరు ఫైరయ్యారు.దీనిని జంతు హింసగా భావించే సదరు యువకులను కఠినంగా శిక్షించాలని మరికొందరు కోరారు.
చివరికి వీడియో అటవీ శాఖ అధికారుల దృష్టికి వచ్చింది దాంతో వారు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.వారి ఫిర్యాదు మేరకు బారాబంకిలోని పోలీసుల స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయ్యింది.







