ఈదురు గాలులకు రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు ఊడిపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు.ఈ ఘటన ఆదివారం సాయంత్రం రావులపాలెం గౌతమి వంతెనపై చోటు చేసుకుంది.
కాకినాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 35 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి కాకినాడకు వస్తుండగా.సాయంత్రం 4.15 గంటల సమయంలో గౌతమి కి రాగానే ఒక్కసారిగా ఈదురుగాలు లతో కూడిన వర్షం పడింది.అద్దాలు పూర్తిగా మూసి ఉండటంతో బస్సు పడిపోయే స్థితిలో గాలికి ఊగింది.
బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.పక్కకు చూస్తే గోదావరి ఉండటంలో గాలి కారణంగా బస్సు పడిపోతుందేమోనని భయంతో కేకలు వేశారు.
ఆ సమయంలో ముందుభాగాన ఉన్న అద్దం ఊడి రోడ్డుపైన పడింది. డ్రైవర్ వీరబాబు నెమ్మదిగా వంతెనను దాటించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకు న్నారు.
రావులపాలెం నుంచి కాకినాడ వెళ్తున్న పల్లెవె తెలుగు బస్సుదీ అదే పరిస్థితి, వంతెన మీదకు వచ్చే సరికి ఈదురుగాలులకు ముందు భాగాన ఉండే రెండు అద్దాలు ఊడి పడిపోయాయి.ప్రయాణికులు ఒక్కసా రిగా ఉలిక్కి పడ్డారు.
డ్రైవర్ వెంటనే బస్సును నిలుపు దల చేసి ప్రయాణికులను వెనుక వస్తున్న మరో బస్సులో పంపించారు.







