ప్రస్తుతానికి జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఒక అభిప్రాయానికి వచ్చేశారు.ఈ విషయంలో జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నా, బీజేపీకి ఒక క్లారిటీ ఉంది.
అయినా జనసేన తమకు దూరం కాకుండా ఉండే విధంగా రకరకాల ప్రకటనలను బిజెపి నాయకులు చేస్తున్నారు.జనసేన సహకారం ఉంటే బీజేపీకి కొన్ని స్థానాలైన దక్కుతాయి అని, పరువు నిలబడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
అయితే బీజేపీ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరే అభిప్రాయంతో ఉన్నారు.బీజేపీ తో తాము కలిసి వెళ్లినా, జనసేనకు కలిసి వచ్చేది ఏమీ ఉండదని.
టిడిపితో కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా తమ రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు.కానీ ఈ విషయాన్ని బహిరంగంగా ఆయన ప్రకటించ లేకపోతున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన తో పొత్తు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెండు పార్టీలు పొత్తు దాదాపు ఖాయమయిందని డిసైడ్ అయిన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు.
కుటుంబ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు .తాజాగా నంద్యాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించగా ఆయన నవ్వుతూ సమాధానం దాటవేశారు.ఈ వ్యవహారమే బీజేపీకి ఆగ్రహం కలిగిస్తోంది.తాము దూరం పెడుతున్న టీడీపీని పవన్ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో గుర్రుగా ఉంది.

ఈ నేపథ్యంలో ని టిడిపితో పొత్తు అంశం పై క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.2024లో మేం అధికారంలోకి వస్తాం జనంతో అవసరమైతే జనసేన తో పొత్తు ఉంటుంది జనసేన మాతోనే ఉంది.ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు.నేను చెబుతున్నా, టిడిపితో జనసేన పొత్తు పై పవన్ కళ్యాణ్ ని అడగండి.ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.ఎవరో చెప్పాల్సిన విషయాలు నేను చెప్పడం భావ్యం కాదు.
మా పార్టీ లైన్ నేను చెప్పాను ” అంటూ పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి వీర్రాజు వ్యాఖ్యానించారు.ఎవరు చెప్పాల్సిన విషయం అంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన విషయాన్ని తనను అడగడం ఏంటి అనే ఉద్దేశంతో వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
తాము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఖచ్చితంగా జనసేన టిడిపి వైపు మొగ్గు చూపుతుందనే విషయం వీర్రాజు కి అర్ధం కావడంతోనే ఈ విధంగా వ్యాఖ్యానించినట్లుగా అర్థం అవుతోంది.
.






