యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని యాదాద్రి మహిళా దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సందర్శించారు.ఈ సందర్భంగా మహిళ సాధికారత మిషన్ జిల్లా కోఆర్డినేటర్ హర్ష మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు.
భేటీ బచావో భేటీ పడావో అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలన్నారు.ఆరోగ్యకరమైన అలవాట్లతో నాణ్యమైన భోజనం తీసుకుంటూ ఉత్తమంగా ఎదగాలని సూచించారు.
అనంతరం ఆట వస్తువులను అందించారు.ఈ కార్యక్రమంలో భార్గవి,నిఖిత, మనీషా,కవిత,ప్రత్యేక అధికారి ఎం.శివరంజని,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







