సాధారణంగా ప్రస్తుత రోజులలో అమ్మాయిలు అబ్బాయిలకు ఏ విషయంలో కూడా తక్కువ కాదని చెప్పవచ్చు.ప్రతి విషయంలో అబ్బాయిలతో పోటీ పడుతూ ఉన్నారు.
అమ్మాయిలు అబ్బాయిలు నా తేడా లేకుండా అన్నిటిలోనూ ముందు ఉంటూ విజయం వైపు అడుగులు వేస్తున్నారు.మనం సాధారణంగా ఎక్కడైనా మగవారి గ్యాంగ్ వార్ చూస్తూనే ఉంటాం.
కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ గర్ల్స్ గ్యాంగ్ వార్ ( Girls Gang War )వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.రోడ్డుపై కొందరు అమ్మాయిలు టూ వీలర్స్ పై వచ్చారు.ఈ క్రమంలో మరికొందరి అబ్బాయిలు అమ్మాయిలను తీసుకొని వచ్చి అక్కడ డ్రాప్ చేశారు.ఇలా వచ్చిన వారిలో ఒక అమ్మాయి స్కూటీ పై దిగి మరొక స్కూటీపై ఉన్న అమ్మాయి పై చేయి చేసుకోవడం జరిగింది.
అలాగే తిరిగి ఆ అమ్మాయి కూడా చంప పగలగొట్టింది.మెడపట్టి వెనక్కు లాగేసి జుట్టు పట్టి స్కూటర్ పైనుంచి లాగి కిందికి అలా కొట్టుకుంటూ పక్కకు తీసుకొని వెళ్ళిపోయింది.
అంతే కాకుండా ఆ మహిళ చేతిలో ఉన్న ఫోన్లు లాక్కొని కింద నేలకు విసిరింది.ఇలా కేవలం కొట్టడమే కాకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడింది.ఇదంతా చూస్తున్న మరొక అమ్మాయి కూడా వారి ఇద్దరిని ఆపేందుకు వెళ్ళగా వారిద్దరి మధ్య కూడా సంఘర్షణ జరిగింది.

ఒకవైపు అమ్మాయిల( girls ) వద్ద ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా కానీ.అబ్బాయిలు మాత్రం అలానే చూస్తూ ఉండిపోయారు.కానీ, వారి గొడవలు ఆపేందుకు ప్రయత్నాలు చేయలేదు.
జరిగిన కాసేపు తర్వాత ఎవరి దారిన వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.వామ్మో.
అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు ఈ గొడవ కచ్చితంగా అబ్బాయి కోసమే అయి ఉంటుందని కొందరు కామెంట్ చేశారు
.






