కరీంనగర్ జిల్లాలో పట్టపగలే బాలిక మిస్సింగ్..!

కరీంనగర్ జిల్లాలో పట్టపగలే బాలిక మిస్సైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.అమ్మమ్మ ఊరి నుంచి బస్సు ఎక్కిన వశిష్ట కృష్ణ కనిపించకుండా పోయింది.

పాఠశాలలకు రెండు రోజులు సెలవులు కావడంతో 13 ఏళ్ల వశిష్ట క్రిష్ణ అమ్మమ్మ ఊరికి వెళ్లింది.సెలవులు పూర్తి కావడంతో బుధవారం ఉదయం వశిష్టను ఆమె తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్ కు పంపించారు.

తరువాత బస్సు నెంబర్ ను తండ్రికి మెసేజ్ చేశారు.కరీంనగర్ - మంచిర్యాల స్టేజ్ వద్దకు బస్సు వచ్చినప్పటికీ అమ్మాయి మాత్రం రాలేదు.

కండక్టర్ ను అడుగగా అమ్మాయి బైపాస్ ప్లైఓవర్ వద్ద దిగిందని తెలిపారు.వెంటనే అక్కడికి వెళ్లిన తండ్రి చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం లేదు.

Advertisement

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

Latest Suryapet News