ఆమె బికినీ సరదా ప్రాణాలు తీసింది.. వంద పర్వతాలు, 97 బికినీలు.. ఇటువంటి మరణం ఎవరికి రావద్దు

గుర్తింపు పొందేందుకు ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఎంత విభిన్నంగా ప్రయత్నిస్తే అంత విభిన్నమైన గుర్తింపును దక్కించుకుంటామనే ఉద్దేశ్యంతో అంతా కూడా వింత వింత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అలాగే తైవాన్‌కు చెందిన గిగివు అనే మహిళ ఎక్కడ ఎతైన పర్వాతాలు కనిపిస్తే అక్కడకు ఎక్కేందుకు సిద్దం అవుతుంది.పర్వతారోహణ అంటే ప్రాణం ఇచ్చే గిగివు వందకు పైగా పర్వతాలు ఎక్కింది.

ఇలా పర్వతాలు ఎక్కితే పెద్దగా గుర్తింపు రాదని భావించిన ఆమె ప్రతి పర్వతంను కూడా బికినీతోనే ఎక్కుతోంది.

పర్వాతాలను ఎక్కడ అక్కడ బికినీతో ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఈమెకు అలవాటు.గతంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా వాటిని లెక్కచేయకుండా సెంచరీ కొట్టేసింది.అయినా కూడా ఆమెకు ఆశ చావలేదు.

Advertisement

ఎ్కడ పర్వతాలు కనిపించినా ఎకేస్తూనే ఉంది.విదేశాల్లో ఉన్న పర్వతాలను కూడా ఎక్కాలనేది ఆమె కోరిక.

ఆమె ఎక్కిన పర్వతాలు లెక్క సెంచరీ దాటిన తర్వాత కాస్త తగ్గుతుందని అంతా భావించారు.కాని ఆమె పర్వతాలను ఎక్కాలనే కోరిక మరింతగా పెరిగింది.

పర్వతాలను ఎక్కుతూ బికినీపై సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలకు ఫోజ్‌లు ఇవ్వడం అనేది గిగివు చేసే రెగ్యులర్‌ పని, తాజాగా కూడా తైవాన్‌ లోని యుశాన్‌ నేషనల్‌ పార్క్‌లోని ఒక ఎత్తైన కొండను ఎక్కింది.అక్కడకు వెళ్లిన తర్వాత తన డ్రస్‌ను రిమూవ్‌ చేసి బికినీపై ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.డ్రస్‌ చేంజ్‌ చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ కొండపై నుండి కింద పడింది.

దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యి మృతి చెందింది.గిగివు మృత దేహంను రిస్య్యూ టీం 24 గంటలు వెదికి, హెలికాప్టర్ల సాయంతో కనిపెట్టారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

గిగివు ఎన్నో సాహసాలు చేసి మహిళలకు ఆదర్శంగా నిలిచింది.కాని ఇలా మృతి చెందడం దారుణం అంటూ స్థానికులు ఆమెకు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు