Gadwal Vijayalakshmi : కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Gadwal Vijayalakshmi ) కాంగ్రెస్ లో చేరారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

 Ghmc Mayor Gadwala Vijayalakshmi Joined Congress-TeluguStop.com

ఈ క్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కాగా గద్వాల విజయలక్ష్మీ తండ్రి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు( K Kesavarao ) కూడా హస్తం గూటికి చేరనున్నారన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తో భేటీ అయిన కేకే కాంగ్రెస్ పార్టీతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.సుమారు 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్నానన్న ఆయన తిరిగి సొంత ఇంటికి వస్తున్నట్లు చెప్పారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube