సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.జిన్సెంగ్ ఆయిల్ పేరుతో డబ్బులు దండుకుంది ఓ మహిళ.
అన్నారం గ్రామానికి చెందిన నరహరి అనే వ్యక్తికి ఆన్ లైన్ లో యుకే మహిళ విలియమ్స్ పరిచయం అయింది.జిన్సెంగ్ ఆయిల్ సరఫరా చేస్తే లాభాలు వస్తాయని నమ్మించింది.సదరు మహిళ మాటలు నమ్మిన నరహరి ఆయిల్ ను కొనుగోలు కోసం విడతల వారీగా రూ.1.76 కోట్లు చెల్లించాడని సమాచారం.తరువాత విలియమ్స్ స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.