సాధారణంగా జామ్( Jam ) అనేది ఒకటి నుంచి రెండు ఏళ్ల వరకు పాడు కాకుండా ఉంటుంది.ఆ తర్వాత అది పాడైపోతుంది అదే పదేళ్ల క్రితం జామ్ అయితే దాన్ని తినకపోవడమే మంచిది.
ఎందుకంటే అవి అప్పటికే చాలా పాడైపోయి ఉంటాయి.ఇక దాదాపు 30 ఏళ్లు క్రితం జామ్ అంటే దాన్ని ట్రై చేయడానికి కూడా జనాలు భయపడతారు కానీ జార్జియానా( Georgiana ) అనే జర్మన్ యువతి చాలా పెద్ద సాహసమే చేసింది.
ఆమె 1996లో అమ్మమ్మ చేసిన జామ్ తిన్నది.అంటే జామ్ వయసు 27 ఏళ్లు.

ఈ యువతి దానిని జర్మనీలోని( Germany ) తన తాతామామల సెల్లార్‌లో కనుగొంది.జామ్ స్టోర్ చేసిన కూజా తెరవడం ఆమెకు చాలా కష్టమైంది.ఆమె దానిని తెరిచి తన ఇద్దరు సోదరులతో కలిసి రుచి చూసింది.జోక్ ఏంటంటే ఇది ఇంత పాతదైనా దాని టేస్ట్ ( Taste ) వాళ్లందరికీ నచ్చింది.యువతి ఈ జామ్ తింటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.“ఇది మా ఫ్యామిలీ మెంబర్స్‌కు( Family Members ) విషం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అంటూ ఆమె ఒక క్యాప్షన్ కూడా రాసింది.ఆ వీడియోను లక్షకు దాకా వ్యూస్ వచ్చాయి.ఆమె వీడియోపై కొందరు కామెంట్లు చేశారు.

కూజా చాలా బలంగా ఉంది.ఇది మరో 27 సంవత్సరాలు చెడిపోకుండా ఉంటుందేమో అని ఒకరు అన్నారు.జామ్‌లోని చక్కెర ఆహార పదార్థాలను ఎక్కువ కాలం మంచిగా ఉంచుతుందని, 1982 నాటి కొన్ని బిస్కెట్లు( Biscuits ) తిన్నా తనకేం కాలేదని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.“యాపిల్ జామ్‌ను తాజాగా ఉంచేది చక్కెర కాదు.అధిక ఆమ్లం, వాక్యూమ్ కారణంగా ఆహార పదార్ధం తాజాగా ఉండి ఉంటుంది.చక్కెర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది.అలానే ఉప్పు బాగా పనిచేస్తుంది.” అని మరొకరు వివరించారు.ఏది ఏమైనా ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.దీనిని మీరు కూడా చూసేయండి.







