జెనీలియాను వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్.. ఘాటైన రిప్లై!

సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు సెలబ్రిటీలు నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోలింగ్ గురవుతుంటారు.

అదే విధంగా మరోసారి వారి చేత ప్రశంసలు కూడా అందుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి ట్రోలింగ్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు జరుగుతుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ అయినటువంటి రితేశ్‌ దేశ్‌ముఖ్, నటి జెనీలియాకు అలాగే జరిగింది.తాజాగా జెనీలియా రితేష్ నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’ షో సీజన్ 2కి అతిథులుగా వచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీల ట్రోలింగ్ కి సంబంధించిన కామెంట్ చదువుతూ కామెంట్ పై వారి రియాక్షన్ ఏంటో తెలుసుకుంటారు.ఈ క్రమంలోనే జెనీలియా తన భర్తకు సంబంధించిన గత ఏడాది హోలీ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియోలో భాగంగా నటుడు రితేష్ ప్రీతిజింతా చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ముద్దు పెట్టడంతో అక్కడే ఉన్నటువంటి జెనీలియా ఎంతో జెలసీగా ఫీల్ అవుతుంది.ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లిన జెనీలియా తన భర్తని కొడుతుండగా ఆయన వద్దు అంటూ ఉన్నటువంటి వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అప్పట్లో జెనీలియాను సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ.ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌.ఇది నీకు అసలు సెట్ అవ్వదు అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ చూసిన జెనీలియా అందుకు ఘాటుగానే రిప్లై ఇచ్చారు.ఈ కామెంట్ జెనీలియా స్పందిస్తూ తన ఇంటి పరిస్థితులు బాగలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా స్పందించారు.

బాయ్ సాబ్ మీ ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ జెనీలియా ఘాటుగా స్పందించారు.ఈ విషయంపై రితేష్ స్పందిస్తూ సెలబ్రిటీల అన్న తర్వాత ఈ విధమైనటువంటి మామూలేనని వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వెల్లడించారు.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు