హ్యాట్సాప్‌.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు అల్లువారి సాయం

ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం, మంచి పేరు అనేది చిన్న సాయంతోనే వస్తుంది.

అతడికి అంత డబ్బు ఉంది అని ఎవరు గొప్పగా చెప్పుకోరు, కాని అతడు చిన్న సాయం చేశాడని మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటారు.

సాయం చేసే గుణం ఉండాలి కాని, డబ్బుతో సంబంధం లేకుండా మంచ పేరు దక్కించుకోవచ్చు.అయితే కొందరు డబ్బున్న వారు తమ మంచి మనసును ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉంటారు.

టాలీవుడ్‌లోనే ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్‌ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూ ఉంటాడు.తాజాగా అల్లు అరవింద్‌కు చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్‌ రోడ్లపై ట్రాఫిక్‌ విధులను నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లారు, వారికి బటర్‌ మిల్క్‌ బాటిల్స్‌ను అందించారు.

ప్రతి ఒక్కరు కూడా బటర్‌ మిల్క్‌ వాటర్‌ బాటిల్స్‌ను అందుకుని సంతోషం వ్యక్తం చేశారు.ట్రాఫిక్‌ పోలీసులతో పాటు జీహెచ్‌ఎంసీ వర్కర్లకు కూడా మజ్జిక బాటిల్స్‌ను అందించడంతో అల్లు వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement

మజ్జిక బాటిల్స్‌పై అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అంటూ రాసి ఉంది.అల్లు అరవింద్‌ చేసిన సాయంకు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.

కోట్లు సంపాదిస్తున్న వారు కొద్ది మొత్తంను ఇలా సేవాకార్యక్రమాలకు ఉపయోగించడం అనేది చాలా మంచి పని అని, ఈ విషయంలో అల్లు అర్జున్‌ను అభినందించకుండా ఉండలేక పోతున్నాను, ఆయన ఈ పనితో గొప్ప వ్యక్తి అయ్యాడు అంటూ ఒక నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.మొత్తానికి అల్లు వారికి పోలీసులతో పాటు నెటిజన్స్‌ హ్యాట్సాప్‌ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు