ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి గౌతమ్ ఎలిమినేట్..శివాజీ ని టార్గెట్ చెయ్యడం వల్లే ఇలా అయ్యిందా?

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్( Bigg Boss ) ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.ముందు సీజన్స్ తో పోలిస్తే ఆసక్తికరమైన టాస్కులు, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో ఈ సీజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది, స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియా లోనే టాప్ 1 ఛానల్ గా నిలిపింది.

 Gautam Out From Bigg Boss 7 Telugu Details, Gautam , Bigg Boss 7 Telugu, Bigg Bo-TeluguStop.com

అంతే కాదు ప్రతీ వారం వీకెండ్ వచ్చినప్పుడు నాగార్జున( Nagarjuna ) ఈ వారం జరిగిన సంఘటనలకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు.కంటెస్టెంట్స్ ని అడగాల్సినవి అడుగుతున్నాడా లేదా, న్యాయంగా మాట్లాడుతాడా లేదా అనేది ప్రత్యేకించి ఆసక్తితో గమనిస్తూ ఉంటున్నారు ప్రేక్షకులు.

ఇకపోతే ఈ సీజన్ లో ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్ లోకి వచ్చి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకొని, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కంటెస్టెంట్ గౌతమ్( Gautam ) మొదటి వారం నుండి ప్రతీ టాస్కు లోనూ తన బెస్ట్ ని ఇస్తూ వచ్చాడు.

Telugu Amardeep, Arjun Ambati, Gautam, Gautam Krishna, Shobha Shetty, Sivaji, Ti

కచ్చితంగా గౌతమ్ టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ లో ఒకరు, కానీ ఇప్పుడు ఆయన ఎలిమినేట్ అయ్యాడు అనే వార్త బయటకి రాగానే హౌస్ లో ఆయన అభిమానులు మొత్తం శోకసంద్రం లో మునిగిపోయారు.గత నాలుగు వారాల నుండి గౌతమ్ టాస్కులలో తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు.దానికి తోడు కారణం లేకపోయినా కూడా శివాజీ ని( Shivaji ) నామినేట్ చెయ్యడం గౌతమ్ కి పెద్ద మైనస్ అయ్యింది.

టికెట్ టు ఫినాలే లో( Ticket To Finale ) కూడా గౌతమ్ ఒక్కటంటే ఒక్క టాస్కు లో కూడా టాప్ 2 స్థానంలోకి కూడా రాలేకపోయాడు.ఇదంతా ఆయన ఎలిమినేషన్ కి కారణం అయ్యింది అని అంటున్నారు నెటిజెన్స్.

వాస్తవానికి ఈ వారం డేంజర్ జోన్ లో అర్జున్ ఉన్నాడు.నామినేషన్స్ రీజన్స్ న్యాయంగా అనిపించకపోవడం వల్ల అర్జున్ పై( Arjun ) భయంకరమైన నెగటివిటీ ఈ వారం ఏర్పడింది.

Telugu Amardeep, Arjun Ambati, Gautam, Gautam Krishna, Shobha Shetty, Sivaji, Ti

కానీ టికెట్ టు ఫినాలే టాస్క్ లో అర్జున్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, అందరూ చూసారు.ఒక విధంగా చెప్పాలంటే ఆయన చరిత్ర సృష్టించాడు.అందుకే డేంజర్ జోన్ నుండి సేవ్ అయ్యి ఎలిమినేషన్ తప్పించుకున్నాడు.ఇక శోభా శెట్టి( Shobha Shetty ) ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమెకి అమర్ దీప్ ఫ్యాన్స్ ఓట్లు ఘనంగా పడ్డాయి, అలా శోభా శెట్టి ఈ వారం కూడా సేఫ్ అయ్యింది.

కానీ పెద్దగా గౌతమ్ మాత్రం అన్యాయం అయిపోయాడు చివరికి అంటూ సోషల్ మీడియా లో ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube